Ads
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా ఈరోజు విడుదలైంది. ఈ సంవత్సరం పఠాన్, జవాన్ సినిమాలతో మంచి ఊపు మీద ఉన్న షారుఖ్ ఖాన్ డంకీ సినిమాతో ముందుకు వచ్చారు.
వైవిధ్య సినిమాలు తరికెక్కించే రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో ఈ మూవీ వచ్చింది. ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరా ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూ చూద్దాం…
- చిత్రం : డంకీ
- నటీనటులు : షారూఖ్ ఖాన్, తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్.
- నిర్మాత : జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్
- దర్శకత్వం : రాజ్‌కుమార్ హిరానీ
- సంగీతం : ప్రీతమ్
- విడుదల తేదీ : డిసెంబర్ 21, 2023.
కథ:
మను(తాప్సి), బుగ్గు(విక్రమ్ కొచ్చర్), బల్లి(అనిల్ గ్రోవర్) పంజాబ్ లోని ఓ మాములు ఊర్లో ఆర్ధిక సమస్యలతో నివసిస్తూ ఉంటారు. ఎలాగైనా లండన్ వెళ్లి బాగా డబ్బులు సంపాదించాలనుకుంటారు. కానీ వీరికి చదువు లేకపోవడం, ఫేక్ వీసా కన్సల్టెన్సీలను నమ్మి మోసపోతారు.వారు ఉన్న పరిస్థితికి ఇంగ్లాండ్ వెళ్లడం అనేది చాలా కష్టంగా మారుతుంది.
ఆ సమయంలో ఆ ఊరికి హర్దయాల్ సింగ్ ధిల్లాన్ అలియాస్ హార్డీ (షారుఖ్ ఖాన్) వస్తాడు.వారి ఆర్థిక పరిస్థితి అన్ని చూసి వారికి ఇంగ్లాండు వెళ్లడానికి సహాయం చేస్తానని ముందుకు వస్తాడు.ఇక షారుఖ్, మిగిలిన వాళ్లంతా అక్రమంగా దేశాలు దాటుకుంటూ ఎన్ని కష్టాలతో ఇంగ్లాండ్ ఎలా వెళ్లారు? అక్కడ వాళ్ళు ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి? మను – హార్డీ ఎందుకు దూరమయ్యారు? మళ్ళీ ఎలా కలిశారు అనే ఎమోషనల్ కథని తెరపై చూడాల్సిందే.
రివ్యూ:
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఓ పల్లెటూళ్ళో జరుగుతుంది.లండన్ వెళ్ళాలి అనే ఆశలతో ఉన్న వాళ్ళతో కామెడీగా సినిమాని నడిపించారు. ప్రీ క్లైమాక్స్ లో విక్కీ కౌశల్ పాత్ర ఆత్మహత్యతో సినిమాని ఎమోషనల్ గా మార్చి ఇంటర్వెల్ ఇస్తారు. ఇక సెకండ్ హాఫ్ అంతా అక్రమంగా దేశాలు దాటేటప్పుడు వాళ్ళు పడ్డ బాధలు అన్ని చూపిస్తారు. వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్లకు ఎదురయ్యే కష్టాలు ఏంటి అని ఎమోషనల్ గా సాగుతుంది. ఇంగ్లాండ్ లో ఇల్లీగల్ గా బతికే వారికి ఎలాంటి కష్టాలు ఉంటాయి అని కళ్ళకి కట్టినట్టు చూపించారు.
Ads
సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ గానే సాగుతుంది. అయితే ఈ కథ అంతా ఫ్లాష్ బ్యాక్ గా నడుస్తుంది. ఓ 50 ఏళ్ళ వయసులో షారుఖ్, తాప్సి, మిగిలిన వాళ్ళతో కథని మొదలుపెట్టి 25 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లి మళ్ళీ క్లైమాక్స్ లో ప్రస్తుత పరిస్థితులని చూపిస్తారు. క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. సినిమా చూసిన వారు సెకండ్ హాఫ్ లో కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేరు. ప్రపంచవ్యాప్తంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పడే బాధలు, వారు ఎందుకు అలా వెళ్తున్నారు అనే కథని తీసుకొని రాజ్ కుమార్ హిరాణి తన మార్క్ ఎమోషనల్ డ్రామాతో నడిపించారు.
హిరానీ గత సినిమా లాగానే ఈ సినిమా కూడా నడుస్తుంది. మాస్ సినిమాలు చేసే షారుక్ ఖాన్ కి ఈ సినిమా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. షారుక్ ని ఇలా చూడడం ఆయన అభిమానులకు కూడా కొత్తగానే
ఉంటుంది. ఫస్ట్ అఫ్ లో స్టోరీ లోకి వెళ్లడానికి ఎక్కువ టైం పట్టింది. అక్కడక్కడ ల్యాగ్ సీన్లు కూడా ఉన్నాయి. అవి తప్పిస్తే డంకీలో నెగిటివ్ ఏమీ లేదు.
పెర్ఫార్మెన్స్:
ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే షారుక్ ఖాన్ తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. ఎమోషనల్ సీన్స్ లో ప్రేక్షకులను ఏడిపించేసారు కూడా. విక్కీ కౌశల్ పాత్ర ఉన్నది కొద్దిసేపైనా గుర్తుండిపోతుంది. తాప్సి పాత్ర కూడా బాగుంది మిగతా నటినటులు అందరూ కూడా తమ పరిధి మేరకు నటించారు.
టెక్నికల్గా ఈ సినిమా చాలా రిచ్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.ఎమోషనల్ డ్రామా మీదే నడవడంతో అమన్ పంత్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ కూడా లొకేషన్ కి, కాలానికి తగ్గట్టు చాలా పర్ఫెక్ట్ గా టోన్ సెట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ లో ఎడిటింగ్ కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- ఎమోషనల్ సీన్స్
- కామెడీ
- పాటలు
మైనస్ పాయింట్స్:
- ఎడిటింగ్
- కొన్ని ల్యాగ్ సీన్స్
రేటింగ్:
3.25/5
ఫైనల్ గా:
రాజ్ కుమార్ హిరానీ చిత్రాలు ఇష్టపడే వారికి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. షారుక్ ఖాన్ ని కొత్తగా చూడాలనుకునే వారు కూడా ఈ సినిమా చూడొచ్చు. రేపు సలార్ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఈ సినిమా ఎంతవరకు నిలబడుతుందో వేచి చూడాలి.
watch trailer :