Ads
ఢిల్లీ వేడుకగా ఆఫ్గనిస్తాన్ జట్టుతో తలపడిన భారత్ వరుసగా రెండవ మ్యాచ్ లో విజయ ఢంకా మోగించింది. ఆస్ట్రేలియా తో మొదటి మ్యాచ్ గెలిచిన తర్వాత అదే జోరు కొనసాగించింది ఇండియా. మొదటి మ్యాచ్ లో డక్ అవుట్ అయ్యి వెనుతిరిగిన రోహిత్ శర్మ తీవ్ర విమర్శలకు గురి అయ్యాడు. రెండో మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టాడు. ఇక ఈ వరల్డ్ కప్ లో టీం ఇండియా మూడో మ్యాచ్ కి సిద్ధమవుతోంది. ఈసారి చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ ను ఢీకొట్టనుంది భారత్. ఆసియా కప్ లో పాక్ ని ఓడించి ఆధిపత్యం చాటింది భారత్. ఇక ఈ సారి వరల్డ్ కప్ లో మరోసారి పాక్ పై ఆధిపత్యం చాతననుండి ఏమో చూడాలి.
ఇది ఇలా ఉంటె…టీం ఇండియా ఓపెనర్ గిల్ డెంగీ కారణంగా మొదటి రెండు మ్యాచ్ లు మిస్ అయిన సంగతి తెలిసిందే. మరి పాక్ తో రేపు (శనివారం) జరగనున్న మ్యాచ్ లో ఆడతాడో లేదో చూడాలి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కి రెండు టీమ్స్ అహ్మదాబాద్‌కు చేరుకున్నాయి.
Ads
టీం ఇండియా వరస విజయాలు నమోదు చేసుకొని మంచి ఫార్మ్ లో ఉన్నప్పటికీ బౌలింగ్ లో సిరాజ్ విషయంలో కొంచెం లోపం అనిపిస్తుంది. బాటింగ్ కోసం కూడా అని శ్రదుల్ ఠాకూర్ ని టీం లో తీసుకుంటున్నారు. కానీ అతని బౌలింగ్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోతుంది. ఆఫ్ఘానిస్థాన్ తో మ్యాచ్ లో కూడా అతని బాటింగ్ అవసరం ఏం ఉంటుంది అనో అతన్ని ఆడించారు.
బ్యాటింగ్ డెప్త్ కోసం అతడ్ని ఆడిస్తున్నారు. కానీ శార్దూల్ కంటే షమీని ఆడించడం బెస్ట్. పైగా శ్రదుల్ ఠాకూర్ ని ఆడించడానికి టాప్ స్పిన్నర్ అశ్విన్ ని టీం నుండి తొలగిస్తున్నారు. అంతే కాక ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న షమీకి అహ్మదాబాద్‌లో మంచి రికార్డు ఉంది. మొదటి స్పెల్ లోనే వికెట్స్ తీయగలడు. మరి రోహిత్ ఏం నిర్ణయం తీసుకుంటాడో ఎదురు చూడాలి.
ఆస్ట్రేలియా తో సిరీస్ లో సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ చేసినప్పటికీ ఈ వరల్డ్ కప్ లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆఫ్గనిస్తాన్ తో మ్యాచ్ లో కూడా చాలా పరుగులే సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ తో మ్యాచ్ లో షమీ టీం లో కచ్చితంగా ఉండాలి అని ఇండియా ఫాన్స్ అంటున్నారు.