Ads
వెబ్ సిరీస్ లు సినిమాలకి ధీటుగా, కొత్త కొత్త కథాంశాలతో తెరకెక్కుతున్నాయి. వెబ్ సిరీస్ లు ఎంతగా హిట్ అవుతున్నాయంటే స్టార్ నటీనటులు సైతం ఇందులో నటించటానికి వెనకాడటం లేదు. అలాంటి ఒక వెబ్ సిరీస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
అమెజాన్ ప్రైమ్ ద్వారా తాజాగా విడుదలైన వెబ్ సిరీస్ సుడల్. ఐశ్వర్య రాజేష్, కథిర్, శ్రీయా రెడ్డి, పార్తిపన్ ఈ సిరీస్ లో కీలక పాత్రలు పోషించారు. సామాజిక ఇతివృత్తానికి క్రైమ్ అంశాలను మేళవించి తెరకెక్కించిన ఈ సిరీస్ కి విక్రం వేద సినిమాతో ప్రతిభను చాటుకున్న పుష్కర్ గాయత్రి షో రన్నర్ గా వ్యవహరించారు.
బ్రహ్మ, అనుచరర్ దర్శకత్వం వహించారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. సంబలూరు ఒక పల్లెటూరు. ఇందులో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ అందరికీ జీవనాధారం. అనుకోకుండా జరిగిన అగ్నిప్రమాదంలో ఫ్యాక్టరీ కాలిపోతుంది. అయితే ఇది కావాలని ఎవరో చేశారు అని పోలీస్ ఆఫీసర్లు రెజీనా ( శ్రీయా రెడ్డి ) చక్రవర్తి(కథిర్ ) నమ్ముతారు. యూనియన్ ప్రెసిడెంట్ షణ్ముగం పై ( పార్తిబన్ ) అనుమానం వ్యక్తం చేస్తారు.
Ads
అదే సమయంలో అతని చిన్న కూతురు నీల కనిపించకుండా పోతుంది. ఒకవైపు పోలీసులు మరొకవైపు నీల సోదరీ నందిని ( ఐశ్వర్య రాజేష్ ) ఆమెని వెతుకుతూ ఉంటారు. అయితే వారి శవాలు ఊరిలో ఉన్న చెరువులో బయటపడతాయి. ఎవరో చంపేశారని పోస్ట్ మార్టంలో తేలుతుంది. అయితే నీలని చంపింది ఎవరు, తన కొడుకు మరణానికి కారణమైన వారిపై రెజీనా ప్రతీకారం తీర్చుకుందా.. నందిని సహాయంతో హంతకుడిని చక్రి పట్టుకున్నాడా అనేది ఇతివృత్తం. ఫస్ట్ ఎపిసోడ్ అంతా పాత్రలు పరిచయానికి ప్రాధాన్యం ఇచ్చారు.
చివరి ఎపిసోడ్ మనసుల్ని కదిలిస్తుంది. తన మనసులో అంతులేని ఆవేదన ఉండి దాన్ని బయటికి వ్యక్తం చేయలేని ఒక యువతీ సంఘర్షణ హృద్యంగా తెరకెక్కించారు. ఇందులో శ్రీయా రెడ్డి నటన అద్భుతంగా ఉంది అధికార బాధ్యతలకు, కొడుకు పై ప్రేమకు మధ్య నలిగిపోయే రెజీనా అనే పోలీస్ ఆఫీసర్ గా శ్రీయా రెడ్డి నటన ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి. ఈమె ఈ మధ్యనే విడుదలైన సలార్ సినిమాలో రాధా రమ పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే.