Ads
సాధారణంగా హీరోయిన్ కావాలంటే అందం, టాలెంట్ తో పాటుగా కొంచెం అదృష్టం కూడా ఉండాలి. గ్లామర్‌గా కనిపిచండమే కాకుండా తమ నటనతో మెప్పిస్తేనే హీరోయిన్లు ఎక్కువ కాలం తమ కెరీర్ కొనసాగించగలరు. అలా చేయలేకపోతే ఒకటి, రెండు చిత్రాలకే పరిమితం అవాల్సిందే.
Ads
లక్ కలిసి వచ్చి ఓవర్ నైట్ స్టార్ అయితే వారి క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. కోట్లల్లో పారితోషికం, స్టార్డమ్, అవకాశాలు క్యూ కడతాయి. అయితే కొన్ని చిత్రాలలో హీరోయిన్ల కన్నా వారి పక్కన ఉండే ఫ్రెండ్ పాత్ర చేసిన వారు, లేదా హీరోయిన్ చెల్లెలి క్యారెక్టర్ చేసినవారికే ఎక్కువగా గుర్తింపు వస్తుంది. వారికి డైలాగ్స్ ఎక్కువగా లేకపోయినా, వారు ఎక్కువ సేపు సినిమాలో కనిపించకపోయినా వారికి క్రేజ్ వస్తుంది. ఇటీవల కాలంలో ప్రేక్షకులు హీరోయిన్స్ కన్నా ఎక్కువగా ఫిదా అయిన సైడ్ రోల్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1.వీర సింహా రెడ్డి – హనీ రోజ్:
నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో మొదటిసారి శృతి హాసన్ బాలయ్యతో జత కట్టింది. కానీ ఫ్లాష్ బ్యాక్‌లో నటించిన హనీ రోజ్కే అందరు అభిమానులైపోయారు. ఈ మూవీ తరువాత హనీ రోజ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
2.లవ్ టుడే – రవీనా రవి & ప్రార్థనా నాథన్:
తమిళంలో మరియు తెలుగులో యువతకి బాగా నచ్చిన సినిమా లవ్ టుడే. ప్రదీప్ రంగనాథన్, ఇవికా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో హీరోయిన్ కన్నా హీరో చెల్లిగా నటించిన రవీనా రవి మరియు ఆమె ఫ్రెండ్ నమితగా చేసిన ప్రార్థనా నాథన్ చాలా మంది ఫిదా అయ్యారు.
3.హిట్ 2 – కోమలీ ప్రసాద్:
అడివి శేషు హీరోగా నటించిన ‘హిట్-ది సెకండ్ కేస్’ లో హీరోయిన్ మీనాక్షి చౌదరి కన్నా పోలీస్ ఆఫీసర్ వర్ష పాత్ర చేసిన కొమలీ ప్రసాద్‌కే ఎక్కువ మనడి ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
4.లవర్స్ డే – నూరిన్ షెరీఫ్:
కన్నుగీటి స్టార్ గా మారిన ప్రియ ప్రకాష్ వారియర్ నటించిన ‘ఒరు ఆధార్ లవ్’ తెలుగులో ‘లవర్స్ డే’ గా విడుదల అయ్యింది. చాలా మంది ప్రియ ప్రకాష్ కోసమే ఈ మూవీని చూశారు. కానీ ఇందులో సైడ్ రోల్ లో చేసిన నూరిన్ షెరీఫ్‌కి అభిమానులు అయ్యారు.
Also Read: ముగ్గురు అగ్ర హీరోలతో చిత్రాలు చేసిన ఆ డైరెక్టర్ ఎలా మరణించాడో తెలుసా?