Ads
భారతదేశంలో సింగర్స్ కి కొదవలేదు. ఎంతో మంది సింగర్స్ ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత. కొన్ని రకమైన పాటలు అంటే కొంత మంది మాత్రమే గుర్తొస్తారు. కానీ కొంత మంది మాత్రం అన్ని రకాల పాటలు పాడగలుగుతారు. దేవుడి పాటలు అంటే మాత్రం కొంత మంది సింగర్స్ గుర్తొస్తారు. ఒక సింగర్ దేవుడు పాటలకి ప్రసిద్ధి చెందారు. ఆమె పాటలు వింటే ఎంత భక్తితో పాడారో అర్థం అవుతుంది. ఇప్పుడు ఆవిడ మన మధ్య లేరు. అయినా కూడా దేవుడి పాటలు అంటే ఈమె పాటలే ఎక్కువ మంది వింటారు.
మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి. ఈ పేరు చెప్తే చాలా తక్కువ మందికి తెలుస్తుంది. అదే, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి అంటే అందరికీ తెలుస్తుంది. ఆమె పేరు వింటేనే అందరికీ అదొక రకమైన గౌరవం వస్తుంది. ఎన్నో సంవత్సరాలు తన గాత్రంతో ఎన్నో గొప్ప పాటలు పాడారు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారు. ఆసియా ఖండంలోని నోబుల్ ప్రైజ్గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన మొదటి వ్యక్తిగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారు ఎంతో గొప్ప ఘనతని సాధించారు.
Ads
ఈమె పాటలలో మొదటిగా గుర్తొచ్చే పాట భజగోవిందం. ఇప్పటికి కూడా భజగోవిందం ఎంత మంది సింగర్స్ పాడినా కూడా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారు పాడిన పాట చాలా మంది వింటూ ఉంటారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారి ఆహారపు అలవాట్లు కూడా సాధారణంగా ఉండేవి. ఇడ్లీలు ఎక్కువగా తినేవారు. తన జీవితంలో అసలు కూల్ డ్రింక్ ముట్టలేదు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారు పాడటం మొదలుపెడితే శ్రోతలు అందరూ కూడా లీనం అయిపోయేవారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారిది ప్రేమ వివాహం. 1940 లో త్యాగరాజన్ సదాశివన్ గారిని పెళ్లి చేసుకున్నారు.
వారికి రాధా విశ్వనాథన్ అనే కూతురు కూడా ఉన్నారు. ఆమె కూడా శాస్త్రీయ విద్వాంసురాలు అలాగే క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకున్నారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారు కర్ణాటక సంగీతంలో తనదైన గుర్తింపుని సంపాదించారు. ఎన్నో భాషల్లో పాటలు పాడారు. ఏ భాషలో పాట పాడినా కూడా ఆ భాష బాగా వచ్చు అనే అంత అనర్గళంగా ఉచ్చారణ ఉండేది. అందుకే ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారి పాటలు అంటే ఇప్పటికి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు.