Ads
సితార ఘట్టమనేని గురించి పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురుగా అందరికీ సుపరిచితురాలే. అచ్చం తండ్రికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది సితార. ఎప్పుడూ ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటుంది. ఫ్యామిలీ ట్రిప్పులు ఫంక్షన్,ఈవెంట్లు, ఇలా సితార ప్రతిసారి సోషల్ మీడియా లో హైలెట్ అవుతూ ఉంటుంది.
ఈమధ్య తండ్రి మహేష్ బాబు కి పోటీ వచ్చే విధంగా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మారింది. చిన్న వయసులోనే బ్రాండింగ్ చేస్తున్న స్టార్ కిడ్ గా సితార రికార్డు సాధించింది. సితార కి ఇన్స్టాగ్రామ్ లో 12 లక్షల పైగానే ఫాలోవర్స్ ఉన్నారు.
Ads
సితార కి దేవుడు మంచి మనసు ప్రసాదించాడు. తన పుట్టినరోజు నాడు పేద ఆడపిల్లలకు సైకిల్లు పంచింది. తాను బ్రాండింగ్ ద్వారా సంపాదించిన డబ్బులను చారిటీ కోసం ఖర్చు పెడుతున్నట్లు చెప్పింది. ఆమెకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి రకరకాల వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. సీతారాం చూసిన వారు ఎవరైనా సరే అచ్చం తన నానమ్మ ఇందిరా దేవిలా ఉంది అంటూ ఉంటారు.తాజాగా సితార మరొక కొత్త విషయంలో సోషల్ మీడియా ట్రెండింగ్ లోకి వచ్చింది. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక రెడ్ కలర్ లెహంగా డ్రెస్ తో దిగిన కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
ఆ పిక్స్ లో సితార చాలా క్యూట్ గా కనిపిస్తుంది. అయితే చాలామంది నెటిజన్లు సితార వేసుకున్న లేహంగా ధర ఎంత అంటూ ఆరాల తీయడం మొదలుపెట్టారు. అయితే ఆ డ్రెస్ ధర తెలుసుకున్న తర్వాత షాక్ అయ్యారు అంటే నిజం. ఈ లెహంగా ధర దాదాపు రెండున్నర లక్షల పైనే ఉంటుందట. సెలబ్రిటీలకు డిజైనర్ అయిన వరుణ్ చక్కిలం డిజైన్ చేసిన ఈ లేహంగా దసరా సందర్భంగా సితార ధరించారు. సెలబ్రిటీల కూతురు అంటే ఈ మాత్రం ఉంటుందిలే అంటూ నేటిజెన్ లు కామెంట్లు పెడుతున్నారు.