Ads
చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అందుకున్న సినిమా సీతారామం. హను రాఘపుడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ విడుదల అయిన అన్ని భాషల్లోను ఆడియెన్స్ బ్రహరథం పట్టారు. ఈ సినిమా ప్రేక్షకుల మనసులో గొప్ప ప్రేమకావ్యంగా నిలిచింది.
Ads
ఈ చిత్రంలో హీరోహీరోయిన్స్ పరిచయం లేకుండానే, ఒకరినొకరు చూడకుండానే ప్రేమించుకోవడం, వారి ఎమోషన్స్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అది మాత్రమే కాకుండా ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ కూడా ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇక ‘సీతారామం’ సినిమాను చూసిన అందరూ చెప్పేది ఒకే ఒక్క మాట అద్భుతం అనే. అలాంటి సినిమాలో ఒక చిన్న లాజిక్ ను డైరెక్టర్ మిస్ చేశాడు. అయితే ఈ మూవీని థియేటర్ లో చూసినప్పుడు ఎవ్వరు ఆ లాజిక్ ను గమనించలేదు.
ఓటీటీలో విడుదల అయినప్పటి నుండి చాలా సార్లు చూస్తూనే ఉన్నారు. దాంతో ఈ మిస్టేక్ ని చాలామంది గమనించారు. లెఫ్టినెంట్ రామ్ రాసిన ఉత్తరాన్ని సీత వద్దకు చేర్చాలి. ఆ లెటర్ ని 20 సంవత్సరాల నుండి పోస్టు చేస్తున్నా, అది రిటర్న్ వస్తూనే ఉంది. ఇక ఆ ఉత్తరాన్ని సీతకి చేర్చే బాధ్యతను ఆఫ్రీన్ కి అప్పగిస్తాడు ఆమె తాత. ఎంతోమంది హెల్ప్ చేయడంతో ఆఫ్రీన్, రామ్ రాసిన ఆ ఉత్తరాన్ని ఫైనల్ గా సీతకు అందేలా చేస్తుంది. అలా ఆ మూవీ ముగుస్తుంది. అయితే అంతా బానే ఉంది కానీ ఈ సినిమాలో లాజిక్ మిస్ అయింది. అది ఏమిటంటే రామ్ కి సీతనే ప్రిన్సెన్స్ నూర్జహాన్ అని ఆ ఉత్తరం రాసేటప్పటికే తెలుసు. అందుకే ఆ విషయాన్ని కూడా ఉత్తరం చివరలో రాస్తాడు. దానితో పాటు పేపర్ క్లిప్పింగ్ ని పెడతాడు. అయితే అడ్రస్ లో మాత్రం నిజమైన పేరు నూర్జహాన్ అని రాయకుండా సీతామహాలక్ష్మి అని రాయడంతో ఆ ఉత్తరాన్ని ఎన్ని సార్లు పోస్ట్ చేసిన రిటర్న్ వస్తూనే ఉంటుంది. దాంతో ఆ మేజర్ లెటర్ బాధ్యతను మనవరాలు ఆఫ్రీన్ కి అప్పగిస్తాడు. ఆడియెన్స్ ‘సీతారామం’ సినిమా చూస్తూ ఈ లాజిక్ గురించి అసలు పట్టించుకోలేదు.
Also Read: సినిమాలను వదిలి సన్యాసం తీసుకున్న 5 గురు బాలీవుడ్ నటినటులు వీరే..