హెల్మెట్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్త!!! హెల్మెట్‌లోకి దూరిన పాము.. వైరల్ అవుతున్న వీడియో..!

Ads

ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ ధరించి నడపాలని, సురక్షితంగా ప్రయాణించమని ట్రాఫిక్‌ పోలీసులు ఎల్లప్పుడు సూచిస్తునే ఉన్నారు. అయితే హెల్మెట్‌ ధరించకపోతేనే కాకుండా, హెల్మెట్‌ ను సరిగ్గా చెక్ చేయకుండా ధరించిన కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంది.

ఇటీవల కాలంలో స్కూటర్లు, బైక్‌లు, కార్లు వంటి వాహనాల్లోకి పాములు వెళ్ళడం వంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఒక వీడియో వారాలుగా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తాజాగా నెట్టింట్లో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి బైకు ఎక్కే ముందు హెల్మెట్ తీసుకుని, తలకు పెట్టుకునే టైమ్ లో హెల్మెట్‌ లో ఏదో కదిలినట్లు సందేహం వచ్చింది. దాంతో హెల్మెట్‌ లోపల పరిశీలించాడు. దాంతో లోపల పాము కనిపించింది. ఆ వ్యక్తి భయంతో హెల్మెట్‌ని దూరంగా  పడేశాడు. ఆ తరువాత పాములు పట్టే వ్యక్తి వచ్చి, ఆ పామును పట్టుకున్నాడు.
ఎలాంటి సందేహం రాకుండా హెల్మట్ లోపల ఆ పాము ఉండడం చూసిన నెటిజెన్లు షాక్ అవుతున్నారు.  హెల్మెట్‌ పెట్టుకునేటపుడు ఏమరపాటుగా ఉంటే పాములాంటివి ఉంటే ప్రాణాలు పోయే ఛాన్స్ ఉందని ఈ వైరల్ వీడియోను చూస్తే అర్ధం అవుతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
కొందరు నెటిజెన్లు ‘‘వామ్మో, ఇక హెల్మెట్ పెట్టుకోవాలంటేనే భయంగా ఉంది’’ అని కామెంట్ చేయగా, కొందరు ‘‘ఈ పాముకు ఎక్కడా ప్లేస్ లేనట్లు హెల్మెట్ లో దూరింది’’ అని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు వివిధ రకాల ఎమోజీలను షేర్  చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియో మూడు లక్షలకు పైగా వ్యూస్‌ను పొందింది.

Ads

Also Read: అయోధ్య రామ మందిరానికి చీపురు కానుక ఇచ్చిన ఈయన ఎవరో తెలుసా.? ప్రత్యేకత ఏంటంటే.?

 

Previous articleజాన్వీ కపూర్ దగ్గర ఉన్న 12 అత్యంత ఖరీదైన వస్తువులు ఏమిటో తెలుసా?
Next articleప్రభాస్ “సలార్” సినిమాలో చూపించిన “కాటేరమ్మ” దేవత కథ తెలుసా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.