Ads
భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ నుంచి అన్రిచ్ నార్టే, సిసంద మగాలా గాయాల కారణంగా తప్పుకున్నారు. ఈ ఇద్దరు పేసర్ల స్థానంలో ఫహుల్క్ వాయో, లిజార్డ్ విలియమ్స్ జట్టులో జాయిన్ అయ్యారు. ఇందులో ఫహుల్క్ వాయో చాలా కాలం దక్షిణాఫ్రికా జట్టులో ఆల్ రౌండర్ గా ఉన్నాడు. అయితే లిజార్డ్ విలియమ్స్ మాత్రం టీం లోకి అప్పుడప్పుడు వస్తూ…పోతూ ఉంటాడు.
వచ్చేది అప్పుడప్పుడైనా ఈ యువ పేసర్ తన బౌలింగ్ తో ప్రత్యర్థులకు దడ పుట్టించడం మాత్రం రొటీన్ గా చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం టీమిండియా కు తన బాల్ పవర్ చూపించడానికి వస్తున్న ఈ లిజార్డ్ విలియమ్స్ ఎవరో చూద్దాం…నిండా 29 ఏళ్లు కూడా లేని ఈ యువ ఆటగాడు ఇప్పటికే దక్షిణాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహించాడు.
Ads
లిజాద్ వ్రేడెన్బర్గ్ లో జన్మించాడు.జూలై 16, 2021 ఇతడు ఐర్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్ తో డెబ్యూ చేశాడు. ఆ తర్వాత మార్చి 2022లో కింగ్స్మీడ్, డర్బన్ లో దక్షిణాఫ్రికా మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో తొలిసారి టెస్ట్ సిరీస్ లో అరంగేట్రం చేశాడు. పదునైన పేస్ తో పాటు ప్రత్యర్ధులు ఊహించలేని స్పీడ్ తో స్వింగ్ వెయ్యడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. స్పీడ్ బాల్స్ తో కన్ఫ్యూజ్ చేయడమే కాదు అవసరాన్ని పట్టి బ్యాటర్లని తన స్లో బాల్స్ బోల్తా కొట్టించి పెవిలియన్ వైపు పరుగులు పెట్టిస్తాడు. గత కొద్ది కాలంగా అత్యుత్తమమైన ప్రదర్శన కనబరుస్తూ…దూసుకు వెళ్తున్న ఈ మినీ సునామి…వరల్డ్ కప్ లో తన సత్తా చాటడానికి రెడీగా ఉంది.