“శ్రీలీల”ను చూసి ఆ అమ్మే.. ఈ అమ్మగా వచ్చింది.. అంటున్న నెటిజన్స్.! బయోపిక్ కూడా తీయాలంట.?

Ads

టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకుని టాప్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న హీరోయిన్లు చాలా తక్కువ మంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషన్ గా మారిన శ్రీ లీల ఇందులో ఒకరు. ప్రస్తుతం ఏ సినిమా చూసినా అందులో హీరోయిన్ శశ్రీ లీల ఉండడం ఆమె సక్సెస్ కు నిలువెత్తు నిదర్శనం. రేపు సంక్రాంతికి గుంటూరు కారం అంటూ మహేష్ తో కలిసి థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ.

రీసెంట్ గా ఈ మూవీ నుంచి వచ్చిన ఓ మై బేబీ అంటూ సాగే సాంగ్ ప్రోమో లో గ్రీన్ కలర్ లంగావోణిలో శ్రీ లీల రచ్చ పుట్టించే విధంగా ఉంది. పదహారణాల తెలుగింటి ఆడపడుచులా.. అందంగా ఉన్న శ్రీ లీల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ లీల ను ఆర్తి అగర్వాల్ లా కనిపిస్తోంది అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళిద్దరి ఫోటోలు పక్క పక్కన పెట్టి ఎన్ని పోలికలో చూడండి అంటూ..మీమ్స్ కూడా చేస్తున్నారు. ఆ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆ అమ్మే..ఈ అమ్మగా వచ్చింది అని సినిమా డైలాగులు పెట్టి మురిసిపోతున్నారు కొందరు అభిమానులు.

ఆర్తి అగర్వాల్ నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమా తోటే ఆమె ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.. దాంతో వరుస ఆఫర్లతో చాలా బిజీ అయిపోయింది. తన కెరీర్ లో ఎన్నో సక్సెస్ లు అందుకున్న ఈ బ్యూటీ సడన్గా బొద్దుగా తయారవడంతో ఆఫర్లు వెంటనే తగ్గిపోయాయి.. ఆ తరువాత బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి.. ఆఖరికి సర్జరీ కూడా చేయించుకుంది. అది కాస్త వికటించడంతో.. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది.

 

Previous articleసందీప్ రెడ్డి సక్సెస్ అవ్వడానికి కారణం అయిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? సందీప్ మీద నమ్మకంతో అమెరికా వదిలేసి మరీ..?
Next articleIPL 2024: రిషబ్ పంత్ ఐపీఎల్ లో ఆడాలంటే కండిషన్ ఇదే…పాపం దిల్లీ క్యాపిటల్స్.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.