IPL 2024 SRH: ఐపీఎల్ ఆక్షన్ లో వాళ్ళని కొనేశారు…కానీ ఈ రూల్ మరిచిపోయారా “కావ్య” గారు.?

Ads

ఐపీఎల్ 2024 కు సంబంధించిన మినీ వేలం దుబాయిలో అట్టహాసంగా జరుగుతుంది. పలు ఫ్రాంచైజిలు స్టార్ ఆటగాళ్లను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి కొంతమందికి ఎప్పుడూ లేనివిధంగా రికార్డు ధర దక్కింది. అయితే ఈమె నీ వేలంలో సన్రైజర్స్ ఈసారి 8 మంది ఓవర్సీస్ ఆటగాళ్ళను దక్కించుకుంది. వారి లిస్టులో ఒకసారి చూస్తే పాట్ కామిన్స్, ట్రావిస్ హెడ్, మార్క్రం,క్లాసెస్,గ్లెన్ ఫిలిప్స్,జాన్సన్, హసరంగా,ఫజలహక్ ఫరూకి ఈ లిస్టులో ఉన్నారు.

ఈ ఏడాది సన్ రైజర్స్ మంచి ఆటగాళ్లనే కొన్నా కూడా ఎక్కువ శాతం విదేశీ ఆటగాలని కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ రూల్ ప్రకారం ఏ మ్యాచ్ లో అయినా సరే కేవలం నాలుగు విదేశీ ప్లేయర్లను మాత్రమే ఆడించాలి. ఇంతమంది విదేశీ ప్లేయర్లను కొన్నా కూడా అందరిని ఒకే మ్యాచ్లో ఆడించడానికి వీలు ఉండదు. అలాంటప్పుడు ఎక్కువ మంది భారత ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి ఉంటే మంచిదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గత కొన్ని సీజన్లుగా సన్ రైజర్స్ టీం అనుకున్నంతగా రాణించడం లేదు.మంచి ప్లేయర్లను కొన్నా కూడా వాళ్లు అనుకున్న విధంగా తమ ప్రదర్శన చూపలేకపోతున్నారు. ఈసారి 2024 లో అయినా సరే సన్ రైజర్స్ తిరిగి పుంజుకుని కప్పు సాధిస్తుందేమో చూడాలి.

Previous article20 ఏళ్ల క్రితం ఆ హీరో పక్కన హీరోయిన్ గా చేసి.. ఇప్పుడు అదే యాక్టర్ కి తల్లిగా స్నేహ.! ఆ హీరో ఎవరంటే.?
Next articleచిన్న పిల్ల అనుకున్నాంగా.? కానీ రవితేజ కొత్త సినిమా హీరోయిన్ వయసు నిజంగా ఇంతనా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.