“దేవర ముంగిట నువ్వెంత..!” అంటూ… ఒక్క పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? మరొక హీరోకి వీరాభిమానిగా కూడా ఫేమస్..!

Ads

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇటీవల పాట విడుదల చేశారు. ఆ పాట ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తోంది. ఈ పాటకి కవర్ సాంగ్స్ కూడా సోషల్ మీడియాలో పాడి షేర్ చేస్తున్నారు. అయితే, ఈ పాట మేల్ సింగర్ పాడిన పాట కాబట్టి, ఎక్కువ మేల్ సింగర్స్ మాత్రమే ఈ పాటని పాడుతున్నారు. అమ్మాయిలు ఈ పాట పాడడం చాలా తక్కువ. అలాంటిది ఒక అమ్మాయి ఈ పాటని పాడి షేర్ చేశారు. అంతే.

sri priya iduri devara song 1

ఒకే ఒక్క పాటతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. స్వయంగా దేవర సినిమా బృందమే ఈ అమ్మాయి పాటని అభినందిస్తూ కామెంట్ చేశారు. ఈ అమ్మాయి పేరు శ్రీప్రియ ఈడూరి. నాని ఫ్యాన్ గర్ల్ పేరుతో సోషల్ మీడియాలో చాలా ఫేమస్. శ్రీప్రియ నానికి వీరాభిమాని. నాని అంటే ఎంత ఇష్టమో తెలపడానికి, నాని పుట్టినరోజు నాడు ఒక స్పెషల్ సాంగ్ కూడా చేశారు శ్రీప్రియ. శ్రీప్రియ ఒక యూట్యూబర్. ఇప్పుడు తన సొంత యూట్యూబ్ ఛానల్ లోనే వీడియోస్ షేర్ చేస్తూ ఉంటారు.

గతంలో షన్ను నటించిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ సిరీస్ లో కూడా నటించారు శ్రీప్రియ. అంతే కాకుండా కొన్ని షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ కూడా చేశారు. శ్రీప్రియ మంచి సింగర్ కూడా. సోషల్ మీడియాలో తన పాటల వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. జీ తెలుగులో దసరా సినిమా ప్రమోషన్ సమయంలో నాని ఒక ప్రోగ్రాంకి అతిధిగా వచ్చారు. అక్కడ నానికి ట్రిబ్యూట్ ఇస్తూ శ్రీప్రియ పాటలు కూడా పాడారు.

ఇటీవల మంచు మనోజ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఉస్తాద్ ప్రోగ్రాంలో నానితో పాటు కలిసి శ్రీప్రియ పాల్గొన్నారు. నాని, తమన్ లాంటి వారు కూడా గతంలో శ్రీప్రియ పాటలని మెచ్చుకుని, శ్రీప్రియ పాడిన వీడియోస్ ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు. దేవర సినిమా పాట పాడి, ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. దాంతో ఇంకా ఫేమస్ అయ్యారు. చాలా మంది శ్రీప్రియ పాటని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Images Source : Instagram (Sripriya Iduri)

Previous article“కన్నడలో కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ నీల్… ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఎందుకు వెళ్లిపోయాడు..?” అనే ప్రశ్నకి ఈ నెటిజన్ సమాధానం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
Next articleకన్నప్ప టీజర్‌లో ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు..? ఈ మిస్టేక్ గమనించారా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.