Ads
తెలుగు తెరకి ఎందరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు కానీ అందులో కొందరు మాత్రం ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ చెరగని ముద్ర వేశారు. అలా టాలీవుడ్ లో అతిలోక సుందరి అన్న వెంటనే గుర్తొచ్చేది శ్రీదేవి… వైవిధ్యమైన నటన, చక్కటి అభినయం తో పాటు కళ్ళు తిప్పుకోలేని అందం ఆమె సొంతం. చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ఆ తరువాత రెండు తరాల స్టార్ హీరోలతో హీరోయిన్ గా నటించారు.
తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా అటు తమిళ్, హిందీలో కూడా పలు చిత్రాలు చేసి బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె కూతుర్లు ఆమె అడుగుజాడల్లోనే బాలీవుడ్ లో మంచి స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న ఆమె పెద్ద కూతురు జాన్వి కపూర్.. ఎన్టీఆర్ దేవర మూవీ తో టాలీవుడ్ లో రంగ ప్రవేశం చేస్తోంది.
తమిళనాడులోని మీనంపట్టి గ్రామంలో రాజేశ్వరి, అయ్యప్పన్ దంపతులకు జన్మించిన శ్రీదేవి కి ,శ్రీలత అనే చెల్లెలు కూడా ఉంది. ఆమె గురించి చాలామందికి పెద్దగా తెలియదు. కానీ శ్రీదేవితో కలిసి పనిచేసిన వారికి మాత్రం సెట్స్ లో శ్రీదేవి తల్లితో పాటు తరచూ కనిపించే శ్రీలత పరిచయమే. 21 ఏళ్ల పాటు అక్క సినీ ప్రస్థానంలో తోడునీడగా నిలిచిన శ్రీలత కొన్ని కుటుంబ తగాదాల వల్ల అక్కకు దూరమైంది.
Ads
తల్లి మరణించిన తర్వాత అక్క చెల్లెలు ఇద్దరి మధ్య దూరం పెరిగింది. శ్రీదేవి తల్లి అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయినప్పుడు చేసిన చికిత్స కారణంగా ఆమె తన జ్ఞాపకశక్తిని కోల్పోవడం జరిగింది. దాంతో హాస్పిటల్ పై కేసు వేసిన శ్రీదేవి సుమారు 7.2 కోట్ల రూపాయలు కేసులో గెలిచింది. అయితే ఆ డబ్బులో తనకు ఎటువంటి వాటా ఇవ్వలేదని మొత్తం తన దగ్గరే ఉంచుకుంది అని శ్రీలత, శ్రీదేవి పై ఆరోపించింది. అంతటితో ఊరుకోకుండా శ్రీదేవి తనకు డబ్బులు ఇవ్వలేదని ఆమె వాటా కోసం కోర్టులో కేసు కూడా వేసి.. రెండు కోట్ల రూపాయలు దక్కించుకుంది.
డబ్బు ఎంత పాపిష్టిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదుగా.. డబ్బు విషయంలో తలెత్తిన తగాదా ఇద్దరి అక్కచెల్లెళ్ల మధ్య అప్పటివరకు ఉన్న అన్యోన్యతను చెల్లా చెదురు చేసింది. ఒకరికి ఒకరు సపోర్టుగా ఉన్న ఇద్దరూ డబ్బు కోసం శత్రువులుగా మారారు. తర్వాత ఇద్దరి అక్కాచెల్లెళ్ల మధ్య సయోధ్య కుదరచడానికి శ్రీదేవి భర్త బోనికపూర్ ఎంతో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇద్దరి మధ్య శత్రుత్వం ఎంత దూరం వెళ్లిందంటే 2018లో శ్రీదేవి మరణించిన తర్వాత చెన్నైలో ఆమె మరణానికి జరిగిన సంతాప సమావేశంలో కూడా శ్రీలత కనిపించలేదు.