Ads
అతిలోక సుందరి పేరు వినగానే గుర్తొచ్చే పేరు శ్రీదేవి. చిన్నతనంలోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టి, ఎన్నో సినిమాలలో నటించి, అలరించారు. ఆ తరువాత టీనేజ్‌లోనే కథానాయక మారింది. హీరోయిన్ గా కొన్నేళ్ళ పాటు సినిమాలలో నటించి, భారతీయ సినీ ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణిగా గుర్తింపు తెచ్చుకుంది.
Ads
పెళ్లి ఆ తరువాత కుటుంబం కోసం సినిమాలకు విరామం ఇచ్చిన శ్రీదేవి, ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే 2018లో యాక్సిడెంటల్ గా చనిపోయింది. కానీ ఫ్యాన్స్ ఆమె మృతి పై సందేహం వ్యక్తం చేశారు. ఇటీవల శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో ఆమె మరణం గురించి క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ రీసెంట్ గా ‘ది న్యూ ఇండియన్’ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, శ్రీదేవి సహజంగా మరణించలేదని, ప్రమాదవశాత్తు చనిపోయిందని స్పష్టం చేశారు. నేషనల్ మీడియా నుండి ఒత్తిడి తీవ్రం అవడంతో తనను దుబాయ్ పోలీసులు సుమారు 48 గంటల పాటుగా విచారించారని అన్నారు. తనపై వచ్చిన నిందలు గురించి మాట్లాడుతూ, అప్పుడు దుబాయ్ లో ఏం జరిగిందో బోనీ కపూర్ తెలియచేసారు.
దుబాయ్ పోలీసులు లైడిటెక్టర్ పరీక్షలతో పాటు మిగిలిన అన్ని పరీక్షలు చేశారు. ఆ తరువాత శ్రీదేవి యాక్సిడెంటల్ గా నీటిలో మునిగి కన్నుమూసిందని రిపోర్ట్ స్పష్టంగా పేర్కొంది. విచారణ పూర్తయ్యాక, శ్రీదేవి మరణంలో ఎలాంటి కుట్ర లేదని, అక్కడి పోలీసులు నిర్ధారించారని చెప్పారు. శ్రీదేవి సినిమాలలో నటించడం కోసం స్ట్రిక్ట్ గా డైట్ ను పాటించేదని ఆయన తెలిపారు. ఏళ్లపాటు ఆమె సాల్ట్ లేని ఆహారం తినేదని, అలా తినవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినలేదని, డాక్టర్లు ఉప్పు లేకుండా తినవద్దని, చెప్పిన శ్రీదేవి అవేవీ పట్టించుకోలేదన్నారు.
శ్రీదేవి స్ట్రిక్ట్ డైట్ పాటిస్తుందనే విషయం పెళ్లి అయిన తరువాత తెలిసిందన్నారు. సాల్ట్ లేకుండా భోజనం తినేదని, దాంతో నీరసించి ఎన్నోసార్లు పడిపోయిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. శ్రీదేవికి లోబీపీ సమస్య ఉందని, డాక్టర్లు చెప్పినా సీరియస్‌గా ఎప్పుడు తీసుకోలేదన్నారు. శ్రీదేవి చనిపోయిన తరువాత అక్కినేని నాగార్జున తనను కలిసినపుడు డైట్ వల్ల ఒకసారి సెట్‌లో సైతం సృహ తప్పిపడిపోయిందని, అప్పుడు శ్రీదేవి పన్ను విరిగిందని, చెప్పినట్లుగా బోనీ కపూర్ వెల్లడించారు.
Also Read: సైలెంట్ గా OTT లోకి వచ్చేసిన ఈ సినిమా చూశారా..? ఏం ఉంది ఇందులో..?