Ads
ఇంగ్లాండ్ తో రాంచి వేదికగా జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీ చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 353 పరుగులు చేసింది. తర్వాత టీం ఇండియా మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించింది.
ఓపెనర్ రోహిత్ శర్మ (2) స్కోర్ తో అవుట్ అవ్వగా, తర్వాత వచ్చిన శుభ్ మన్ గిల్ 38 పరుగులతో పెవిలియన్ బాట పట్టారు. రజత్ పటీదార్ (12), సర్ఫరాజ్ ఖాన్ (14) చేయగా, ఆ తర్వాత వచ్చిన యశస్వి జైస్వాల్ 73 పరుగుల స్కోర్ చేశారు.
అప్పటికి టీం ఇండియా స్కోర్ 171 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. అప్పుడు వచ్చిన ధ్రువ్ జురెల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి, రెండవ రోజు కూడా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. మూడవ రోజు కుల్దీప్ యాదవ్ (28)తో కలిసి 96 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, ఆ తర్వాత భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించి 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర టామ్ హార్ట్లీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత ధ్రువ్ జురెల్ సెల్యూట్ చేశారు.
Ads
ఇలా ఎందుకు చేశారు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. దీని వెనుక ఒక కథ ఉంది. అదేంటంటే, ధ్రువ్ జురెల్ తండ్రి నేమ్ చంద్ ఇండియన్ ఆర్మీలో హవల్దార్ గా పనిచేసే పదవి విరమణ పొందిన తర్వాత, తన కొడుకు కూడా ఆర్మీలోకి వెళ్ళాలి అని అనుకున్నారు. కానీ ధ్రువ్ జురెల్ క్రికెటర్ అయ్యారు. ఇప్పుడు తన తండ్రి మీద ఉన్న గౌరవంతో ఇలా సెల్యూట్ చేశారు.
1999 లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ధ్రువ్ జురెల్ తండ్రి పాకిస్తాన్ తో కూడా తలపడ్డారు. ఈ విషయం మీద ధ్రువ్ జురెల్ మాట్లాడుతూ, “అలా నేను నా తండ్రి కోసం చేశాను. ఆయన ఒక కార్గిల్ యుద్ధ వీరులు. మొన్న మా నాన్నతో మాట్లాడినప్పుడు ఒక్క సెల్యూట్ అయినా చూపించు అని అన్నారు. నేను పెద్దవాడిని అవుతున్నప్పుడు నేను చేసింది అదే. ఇలా చేసింది ఆయన కోసమే” అని చెప్పారు.
ALSO READ : కెప్టెన్ కూల్ ధోని డైట్ ఏమిటి..? అసలు ఏం తింటారో తెలుసా..?