Ads
చాలామంది రాజులు మన దేశాన్ని పరిపాలించారు. మనం ఎంతో మంది రాజుల పేర్లు ఆ రాజు తాలూకా వంశాలు ఇటువంటివన్నీ విన్నాము. అయితే ఈ రాజుల అందరికంటే ఏ రాజు బలవంతుడు అని నాకు చాలాసార్లు సందేహం కలిగింది. మీకు కూడా ఈ సందేహం వచ్చిందా..? అందరి కంటే బలమైన రాజు ఉన్నారా..? ఉన్నారు. అందరి కంటే బలమైన రాజు సముద్రగుప్తుడు.
భారతదేశ చరిత్రలో సముద్రగుప్తుడే అత్యంత బలమైన రాజు. రాజులకే రాజు ఈ సముద్ర గుప్తుడు. సముద్ర గుప్తుడి గురించి సముద్ర గుప్తుడి గురించి చెప్పకో దగ్గ విషయాలు గురించి ఇప్పుడు చూద్దాం.
రాజులని ఓడించి పరిపాలించాడు..
సముద్ర గుప్తుడు ఉత్తరాన ఉన్న హిమాలయాల నుండి దక్షిణాన ఉన్న నర్మదా దాకా తూర్పునున్న బ్రహ్మపుత్రా నది నుండి పడమర వైపునున్న యమునా వరకు అనేక రాజ్యాలని ఏకచత్రాధిపత్యంగా పరిపాలించాడు సముద్రగుప్తుడు. అంతేకాదు సముద్ర గుప్తుడు ఉత్తర దిశ లో ఉన్న నాగ వంశానికి చెందిన రాజులని ఓడించాడు కూడా. దక్షిణాన ఉన్న 12 మంది రాజులని కూడా ఓడించాడు. అన్ని రాజ్యాలని ఆయన ఒక్క రాజంగా మార్చి ఈ భారతదేశాన్ని పరిపాలించాడు.
సముద్ర గుప్తుడి గొప్పతనం:
Ads
సముద్ర గుప్తుడి గురించి హరిసేన అనే ఒక కవి వివరించారు. అలహాబాద్ స్తంభం పై దాన్ని చూడచ్చు. దానిమీద సముద్రగుప్తుడి యొక్క ధైర్య సాహసాలని వర్ణించారు. సముద్ర గుప్తుడు వీణ వంటి వాయిద్యాలని కూడా వాయించేవాడు. ఆయన చిత్రాలలో మనకివి కనబడుతూ ఉంటాయి.
పైగా సముద్రగుప్తుడు తన హయాంలో కొన్ని నాణాలని కూడా తీసుకు రావడం జరిగింది. ఆ నాణాలతో పాటుగా విలువిద్య, యుద్ధ విద్య కూడ నాణాలు మీద కనబడేటట్టు చేయించారు సముద్రగుప్తుడు. అంతేకాకుండా అశ్వమేధ, పులిని చంపే వారి నాణాలు, రాజు రాణి గాయకుడి నాణాలని కూడా అప్పట్లో ముద్రించారు.
సముద్ర గుప్తుడి స్వర్ణ యుగం:
స్వర్ణ యుగమని సముద్ర గుప్తుడు పరిపాలించిన కాలాన్ని అంటారు. అలానే దీన్నే గుప్తుల యుగం అని కూడా పిలుస్తారు ఎన్నో రాజ్యాల మధ్య శాంతిని కూడా నెలకొల్పాడు సముద్రగుప్తుడు. బౌద్ధ సన్యాసుల కోసం ప్రత్యేక ఆశ్రమాన్ని కూడా నిర్మించడానికి అనుమతి కూడా ఇచ్చాడు.
సముద్ర గుప్తుడి విజయం:
ప్రతి యుద్ధంలో కూడా విజయాన్ని సాధించేవాడు. సముద్రగుప్తుడు కి ఒకసారి యుద్ధం సమయంలో తీవ్ర గాయాలు అయ్యాయి. గొడ్డళ్లు, బాణాలు, మేకులు, కత్తులు వంటి ఆయుధాలు దాడి వలన విపరీతంగా గాయాలు అయ్యాయి ఆ గాయం తాలూకా మచ్చలు కూడా శరీరం మీద ఉన్నాయి. అయినా సరే వాటిని తట్టుకొని వున్నాడు.