Ads
తల్లి తండ్రి తర్వాత ఉన్నతమైన స్థానాన్ని గురువుకి ఇచ్చింది మన సమాజం. పిల్లల ఉజ్వలమైన భవిష్యత్తు కోసం తల్లిదండ్రులతోపాటు గురువు మాత్రమే పరితపిస్తాడు. అలాంటి ఒక గురువు వావి వరుసలు మరిచిపోయి తన స్టూడెంట్ తో రాసలీలలు సాగించడం అది కాస్త బయటపడి ఇద్దరూ అబాసు పాలైన వైనం కర్ణాటకలో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో మురగమల్లా లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తుంది ఈ ఉత్తమమైన మహిళా గురువు.
స్కూల్లో విద్యార్థులతో పాటు గురువులు కూడా ఈ మధ్య పిక్నిక్ కి వెళ్లారు. అయితే అక్కడ ఎవరి పనుల్లో వారు మునిగిపోయిన సమయంలో ఆ గురువు, ఈ స్టూడెంట్ ఇద్దరు రొమాంటిక్ ఫోటో షూట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రేమికుల మాదిరిగానే ప్రేమలో మునిగిపోయారు. ముద్దులు కౌగిలింతలతో రెచ్చిపోయారు. స్టూడెంట్ ఏమో ఎల్లో కలర్ షేర్వానీ ధరిస్తే టీచర్ ఏమో పింక్ కలర్ చీర ధరించి మెరిసిపోయింది. ఈ ఇద్దరు కలిసి చెట్ల మధ్య ఫోటో షూట్ చేశారు.
Ads
ఆ సమయంలో మరో స్టూడెంట్ వీళ్ళిద్దరి రాసలీలలని ఫోటో తీయడంతో అసలు విషయం బయటపడింది. దాంతో విద్యార్థి తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు. వెంటనే బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కి ఫిర్యాదు చేయడమే కాదు ఆ గురువు తీరుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీచర్లు పాఠాలు చెబుతారని స్కూల్ కి పంపితే విద్యార్థులతో ప్రేమ పాటలు వల్లిస్తున్నారని ప్రిన్సిపాల్ హోదాలో ఉండి కూడా పదవ తరగతి విద్యార్థితో రొమాన్స్ చేయడం..
అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని స్థానికులు, విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు ఆ ప్రిన్సిపల్ కొన్ని ఫోటోలు, వీడియోలు తొలగించినట్లు గ్రహించారు ప్రస్తుతం ఆ ప్రధానోపాధ్యాయురాల్ని సస్పెండ్ చేశారు.