ఈ కాలంలో కూడా మీలాంటి వెనుకబడిన ఆలోచన ఉన్నవారు ఇంకా ఉన్నారు అని నిరూపించారు..! సూపర్ సర్..!

Ads

గతంలో హీరోయిన్స్ అంటే ఇలా మాత్రమే ఉండాలి అని అనుకునేవారు. హీరోయిన్స్ సాధారణమైన అమ్మాయిల లాగా కనిపించకూడదు అని అనేవారు. పర్ఫెక్ట్ గా ఉండాలి అని అంటారు. అంటే, వారి ముఖం మీద మొటిమలు ఉండకుండా, ముక్కు ఇవన్నీ కూడా సరిగ్గా ఉండాలి అని అంటారు. అలా లేని వాళ్ళని హీరోయిన్ కింద లెక్క చేయరు. కానీ అలా ఉన్నవాళ్లు కూడా హీరోయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. హీరోయిన్ కి కావాల్సింది నటన. నటించడం బాగా వస్తే హీరోయిన్ అయ్యే అవకాశం ఉంటుంది అని నిరూపించిన వారు చాలా మంది ఉన్నారు.

sunil lahri comments on sai pallavi

టాలెంట్ ఉంటే హీరోయిన్ అవుతారు అని వీళ్ళందరూ కూడా ఉదాహరణగా నిలిచారు. అందులో మొదటిగా గుర్తొచ్చేది సాయి పల్లవి. అయితే సాయి పల్లవి ఇప్పుడు హిందీలో రామాయణం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి సీతమ్మగా నటిస్తున్నారు అని తెలిసిన తర్వాత అందరూ కూడా ఆనందపడ్డారు. కానీ, ఇంత బాగా ఆలోచించే వారి మధ్యలో కూడా ఎక్కడో వెనుకబడిన ఆలోచన ఉన్న వారు కొంత మంది అయినా ఉంటారు. వారిలో ఈ వ్యక్తి కూడా అని అందరూ అంటున్నారు. ఆయన రామాయణం సీరియల్ లో లక్ష్మణుడిగా నటించారు. ఆయన పేరు సునీల్ లహ్రీ.

Ads

ఆయన సాయి పల్లవి గురించి మాట్లాడుతూ, “ఆ అమ్మాయి ఎలా నటిస్తుందో నాకు తెలియదు. నేను తన సినిమాలని చూడలేదు. కానీ లుక్స్ పరంగా మాట్లాడితే నాకు అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. నా మెదడులో సీత చాలా అందంగా ఉంటుంది. ఆమె ముఖము చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సాయి పల్లవిలో ఆ పర్ఫెక్షన్ అనే లక్షణం ఉంది అని నేను అనుకోవట్లేదు. భారతదేశ ప్రజల మైండ్ సెట్ ప్రకారం చెప్పాలి అంటే ప్రపంచంలో ఉన్న దేవతలు అందరూ కూడా ఎంతో అసాధారణంగా ఉండాలి. రావణుడు ప్రేమలో పడే అంత ఆకర్షణీయంగా ఈ నటిని ఎలా చేస్తారో నాకు తెలియదు” అని చెప్పారు.

అలాంటి వ్యక్తి నుండి ఇలాంటి కామెంట్స్ వస్తాయి అని ఎవరు అనుకోలేదు. అసలు సాయి పల్లవిని సీతమ్మగా తీసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం. కానీ ఇలా కామెంట్స్ చేయడం ఏంటి అంటూ అందరూ సునీల్ మీద కామెంట్స్ చేస్తున్నారు. అసలు హీరోయిన్స్ అంటే టాలెంట్ ఉండాలి అని అనుకునే ఈ కాలంలో కూడా ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

Previous articleAranmanai 4 Baak OTT Release : ఎట్టకేలకి OTT లోకి వచ్చిన తమన్నా కొత్త సినిమా..! స్టోరీ ఏంటంటే..?
Next articleరజినీకాంత్ “నరసింహ” సినిమాలో… “నీలాంబరి” పాత్రని వదులుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.