Ads
టాలీవుడ్ జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అగ్ర హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, టాలీవుడ్ కి సాంకేతికతను పరిచయం చేసిన కృష్ణ నటీనటులకు చాలా గౌరవం ఇచ్చేవారు.
తన సినిమా నుండి ఒక ఆర్టిస్టును తీసేయాలని ఇతర ఆర్టిస్టులు కోరినా, ఆ నటుడికి గౌరవం ఇచ్చి, ఆయన్ని కృష్ణ గారు తొలగించలేదని మేకప్‌మేన్ సి.మాధవరావు చెప్పారు. ఆ నటుడు ఎవరో? ఆ సినిమా ఏమిటో ఇప్పుడు చూద్దాం..
హీరో కృష్ణ 1972లో పండంటి కాపురం అనే చిత్రాన్ని చేశారు. ఈ చిత్రానికి ఆయన సోదరుడు హనుమంత రావు నిర్మాత. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో తెలుగు ఆడియెన్స్ ఎంతగానే అలరించింది. 175 రోజులు విజయవంతగా ప్రదర్శించబడి, రాజతోత్సవ వేడుకలను చేసుకుంది. ఆ ఏడాది తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా నేషనల్ అవార్డును, ఉత్తమ తెలుగు చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది.
ఈ చిత్రంలో కృష్ణ , ఎస్వీ రంగారావు, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి అన్నదమ్ములుగా నటించారు. ఎస్వీ రంగారావు అంటే కృష్ణకు చాలా గౌరవం. ఇక ఈ మూవీలో ఒక సాంగ్ పాట షూటింగ్ శివాజీ గార్డెన్స్‌లో ఏర్పాటు చేశారు. ముఖ్య పాత్రలో నటిస్తున్న రంగారావుగారు షూటింగ్ దగ్గరికి రాలేదు. ఆయన తాగి ఇంట్లో నిద్రపోయినట్లు తెలిసింది. దాంతో ఆయనను తీసుకొచ్చేందుకు ప్రభాకర్ రెడ్డి వెళ్లారు. ఆయన్ని బ్రతిమిలాడి షూటింగ్ కి తీసుకొచ్చారు. కానీ రంగారావు గారు షూటింగ్‌లో పాల్గొనకుండా ఉండడానికి ఏవో సాకులు చెప్పి, తన వల్ల ఇప్పుడు కాదని, వదిలెయ్యాలని అనేవారు.
దాంతో రంగారావు మాటలకు ప్రభాకర్ రెడ్డికి కోపం రావడంతో ‘చంపేస్తాను ఏమనుకుంటున్నావో. ఇంతమంది నటీనటులు ఉన్న షూటింగ్, వీళ్ళంతా మళ్ళీ దొరకరు’ అని ఆయన పై కేకలు వేశారు. అప్పుడు రంగారావు గారికి కోపం వచ్చి ‘నన్నే చంపుతానంటావురా, చంపెయ్. గ్రేట్ రంగారావుని చంపెయ్’ అంటూ అరిచారు. దాంతో ప్రభాకర్ రెడ్డికి తాను తప్పుగా మాట్లాడిన విషయం అర్దం అయ్యి, రంగారావు గారి కాళ్లు పట్టుకుని, క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత ఆయన ఇంటికెళ్లిపోయారు. ఈ గొడవ అంతా చూసిన గుమ్మడి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, రంగారావు తప్ప మరో నటుడు లేడా.
Ads
తాగుబోతు అవడం వల్లే హరనాథ్‌ను ఇండస్ట్రీ పక్కన పెట్టింది కదా అని చెప్పారు. ఆ క్యారెక్టర్ ను రంగారావు గారు మాత్రమే చేయగలరు. వేరేవారు ఆ పాత్ర చేయలేరు అని కృష్ణగారు చెప్పారు. ఆయన్ని బ్రతిమిలాడి అయినా ఈ పాత్ర ఆయనతోనే చేయించాలని చెప్పారు. కృష్ణ మాటలను మేకప్‌మేన్ రంగారావు గారికి చెప్పడంతో కృష్ణగారు తనపై పెట్టుకున్న నమ్మకం తెలిశాక, మూవీ పూర్తయ్యే వరకు తాగనని నిర్ణయం తీసుకున్నారు. తన పాత్రను అద్భుతంగా పండించారు. ఇక నటుడిని తొలగించాల్సివచ్చినా కూడా కృష్ణగారు ఆ పనిచేయలేదని, అదే ఆయన ఆర్తిస్తులకు ఇచ్చే గౌరవం అంటూ మాధవరావు చెప్పుకొచ్చారు.
Also Read: గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పడం కాదు అంటూ.. బాలయ్య పై నటి మాధవి లత కామెంట్స్..!