Ads
వన్డే ప్రపంచకప్ టోర్నీలో విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా తదుపరి మ్యాచ్ లో శ్రీలంకతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో నవంబర్ 2న జరగనుంది. ఈ మ్యాచ్ ఆడటం కోసం టీమిండియా ముంబై చేరుకుంది.
మ్యాచ్‌కు సమయం ఉండడంతో టీమిండియా క్రికెటర్ గుర్తుపట్టకుండా రెడీ అయ్యి, కెమరా తీసుకుని, వరల్డ్‌కప్ లో టీమిండియా ప్రదర్శన పై ముంబై వీధుల్లో ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నాడు. ఆ క్రికెటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
భారతజట్టు శ్రీలంకతో ఆడే మ్యాచ్ కోసం ముంబై చేరుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ కు ఒకరోజు సమయం ఉండడంతో నంబర్ వన్ టీ20 క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కెమెరామెన్‌గా అవతారం ఎత్తారు. ప్రజలు గుర్తుపట్టకుండా ఉండడం కోసం మాస్క్, గ్లాసెస్ ధరించి, తన టాటూలు కనిపించకుండా ఫుల్ షర్ట్ ధరించి, తలపై క్యాప్ పెట్టుకున్నారు. సూర్యకుమార్ కెమెరా పట్టుకుని ఇదే గెటప్ తో ముంబై ప్రజల మధ్యకు వచ్చాడు.
టీమిండియా పై ముంబై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి మరియు తన బ్యాటింగ్ గురించి సైతం అక్కడి వారిని అడిగాడు. సూర్యకుమార్ తనని గుర్తుపట్టని విధంగా వెళ్ళి తన బ్యాటింగ్ గురించి అభిమానులు చెప్పిన జవాబులు విని ఆశ్చర్యానికి గురయ్యాడు. ప్రపంచ కప్ లో టీమిండియా ఆట గురించి అడుగగా, అభిమానులందరు భారత జట్టు పై ప్రశంసలు కురిపిస్తూ, ప్రపంచ కప్ విజేతగా నిలుస్తుందని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఆ తరువాత వరల్డ్‌కప్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఎలా ఉందని ఒక అభిమానిని అడిగాడు. ఆ అభిమాని తాను మాట్లాడుతున్నది సూర్యకుమార్ తో అనే విషయం తెలియక అతను మరింతగా మెరుగు పడాలని సమాధానం చెప్పాడు. ఇది విన్న సూర్యకుమార్ విస్తుపోయాడు. ఈ విషయాన్ని సూర్యకుమార్ ఒక వీడియో ద్వారా తెలిపాడు. ఆ అభిమాని తన గురించి మాట్లాడేటప్పుడు నవ్వాలని అనిపించిందని వెల్లడించాడు.
Also Read: వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ గెలిచిన తర్వాత భారత్ “డ్రెస్సింగ్ రూమ్”లో ఏం జరుగుతుందో తెలుసా..?