Ads
1991 జనవరి 22న ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బలేరి లో జన్మించిన స్వప్నిల్ సింగ్ 2008లో క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ లో స్వప్నిల్ సింగ్ ను ముంబై ఇండియన్స్ ఫ్రాంచేసి నాలుగు లక్షల కి కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2016లో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ 10 లక్షల స్వప్నిల్ ని దక్కించుకుంది. ఆపై 2023 సంవత్సరంలో స్వప్నిల్ సింగ్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో భాగంగా ఉన్నాడు.
ఈ విధంగా మూడు జట్లలో కనిపించిన బౌలింగ్ ఆల్రౌండర్ ఆడిన మొత్తం మ్యాచుల సంఖ్య ఏడు మాత్రమే కావడం గమనార్హం. ఈ ఏడు మ్యాచ్లలోని స్వప్నిల్ సింగ్ 14 పరుగులు మాత్రమే చేసి కేవలం ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. స్వప్నిల్ సింగ్ ఐపీఎల్లోకి అడుగుపెట్టి పదహారేళ్లు పూర్తయ్యాయి అయితే కేవలం అతను ఆడిన మ్యాచులు ఏడు మాత్రమే.
Ads
ఈ సారి ఐపీఎల్ మినీ వేలంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ ఆటగాడిని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ 20 లక్షలకి కొనుగోలు చేసింది. టీ 20 క్రికెట్లో 75 మ్యాచ్లు ఆడి 63 వికెట్లు మాత్రమే తీశాడు స్వప్నిల్. అదే సమయంలో బ్యాటింగ్లో 849 పరుగులు చేశాడు. అయితే స్థానిక ప్రతిభను చాటి చెప్పకుండా 32 ఏళ్ల ఆటగాడికి ఆర్సిబి అవకాశం కల్పించడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వారి ఎంపిక వారికి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.