Ads
సినీ పరిశ్రమలోకి ఎంతో మంది బాలనటులుగా అడుగు పెట్టినవారు ఆ తరువాతి కాలంలో హీరోలుగా కూడా మారారు. చిన్నతనంలోనే అగ్ర నటుల చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలా గుర్తింపు పొందిన చైల్డ్ ఆర్టిస్టులు పెద్దగా అయిన తరువాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలా మంది విజయం పొందారు.
కొందరు బాలనటులుగా పేరు, గుర్తింపు పొందినప్పటికి, హీరోగా విఫలమయ్యారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన స్వయంకృషి చిత్రం 1987లో విడుదల అయ్యింది. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా హీరోయిన్ విజయశాంతి నటించింది. ఈ సినిమాలో బాలనటుడు అర్జున్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాలో మాస్టర్ అర్జున్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు.
స్వయంకృషిలో అర్జున్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో అతనికి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వచ్చాయి. సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించిన పచ్చని కాపురం చిత్రంలో మాస్టర్ అర్జున్ నటించి ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి తాతినేని రామారావు డైరెక్షన్ చేశారు. ఈ చిత్రంలో భార్యాభర్తలు అయిన శ్రీదేవి, కృష్ణ విడిపోతారు. తండ్రి దగ్గర పెరిగిన కొడుకుగా, అమ్మ కోసం బాధపడుతూ ఎదురుచూసే కొడుకు క్యారెక్టర్ లో మాస్టర్ అర్జున్ నటించాడు.
ఆ తరువాత శోభన్ బాబు, ప్రీతి, సుహాసిని హీరోహీరోయిన్లుగా నటించిన ఇల్లాలు ప్రియురాలు అనే మూవీలో కూడా అర్జున్ నటించాడు. ఈ సినిమాలో హీరో శోభన్ బాబు ప్రియురాలు అయిన ప్రీతికి పుట్టిన బాబుగా అర్జున్ నటించాడు. ప్రీతి మరణించడంతో ఆ బాబు సుహాసిని ఇంటికి వెళ్ళడం, ఆ ఇంటిలో సుహాసినితో మరియు ఆమె పిల్లలు తిడుతూ ఇబ్బంది పెడుతుంటారు. ఆ సన్నివేశంలో అర్జున్ నటన ఆకట్టుకుంటుంది. అలా బాలనటుడిగానే ఎన్నో మంచి పాత్రల్లో నటించిన మాస్టర్ అర్జున్ తెలుగులోనే కాకుండా కన్నడ, హిందీ భాషలలో నటించాడు.
Ads
అర్జున్ పెద్దయ్యాక హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే పెద్దగా విజయం సాధించలేకపోయాడు. ఇక దాంతో ఇండస్ట్రీకి వదిలిపెట్టాడు. బాగా చదువుకుని డాక్టర్ గా అమెరికాలో స్థిర పడ్డాడు. డాక్టర్ అయినప్పటికీ అర్జున్ కి సంగీతం అంటే ఇష్టం ఉండడంతో అర్జున్ అప్పుడప్పుడూ సంగీత కచేరీలు కూడా చేస్తున్నాడని తెలుస్తోంది.
Also Read: ”నందమూరి తారకరత్న” అలేఖ్య ప్రేమ కథ విన్నారా..? ఇంత జరిగిందా..?