Ads
ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్న వారిలో గుండెపోటుతో కన్నుమూస్తున్నవారే ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016 సర్వే ప్రకారం 17.9 మిలియన్ల ప్రజలు హార్ట్ ప్రాబ్లెమ్స్ తో చనిపోయారు.
ఈ మరణాలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం 85% గుండెపోటు కారణంగానే సంభవించాయని తెలుస్తోంది. గుండెపోటు ఇతర జబ్బుల మాదిరిగా కాకుండా, ఆకస్మికంగా రావడంతో ఎంతోమంది ప్రాణాలు విడుస్తున్నారు. అయితే గుండెపోటు రావడానికి ముందు కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఈ మధ్య కాలంలో ఎక్కువగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ తో మరణించేవారి సంఖ్య ఎక్కువగా పెరిగింది. మధ్యవయస్కులలోనే కాకుండా 18 ఏళ్ళ లోపువారు కూడా గుండెపోటుతో కుప్పకూలడం వార్తల్లో చూస్తూనే ఉన్నాము. అయితే గుండెపోటు రావడానికి ముందు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీటిలో ఛాతి నొప్పి ముఖ్యమైన లక్షణం అని భావిస్తారు. కానీ ఛాతి నొప్పి కన్నా ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించగలిగితే ప్రాణాలు రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గుండెపోటు వచ్చే ముందు చెవుల్లో భారంగా అనిపిస్తుంది. నొప్పిగా ఉండడం, వింత సౌండ్స్ వినిపించినట్లుగా ఉంటుంది. కుడి చెవి కరొనరీ ఆర్టరీలో ఏదైనా అడ్డంకి ఏర్పడినపుడు గుండెపోటుకు దారి తీస్తుంది. అంతేకాకుండా కొందరిలో గుండె పోటు వచ్చే ముందు ఇయర్ లోబ్ ముడత పడతాయి. ఇది ఒక విచిత్ర లక్షణం అని చెప్పవచ్చు. గుండెపోటు వచ్చే ముందు చెవులు వాస్తాయి. చెవులు విపరీతమైన పెయిన్ ఉంటుంది.
చెవి నుండి చీము కారడం లేదా ఒక రకమైన ద్రవం వస్తుంది. ఇది కూడా హార్ట్ ఎటాక్ కు వార్నింగ్. అందువల్ల చెవినొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించడం మంచిది. అయితే చెవులలో వచ్చే పెయిన్స్ అన్ని హార్ట్ ఎటాక్ లక్షణాలు కాకపోవచ్చు. అయితే కొన్ని మాత్రం డేంజర్ అని చెబుతున్నారు. గుండెపోటును నివారించడానికి ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ను అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. హెల్దీ ఫుడ్, క్రమం తప్పని వ్యాయామం చేయడం పాటించడం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Ads
Also Read: ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు బ్రహ్మముడి సీరియల్ కావ్య చెప్పిన చిట్కా..! ఏంటంటే.?