ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా చూసారా.? భార్యాభర్త మధ్యలో ఆత్మ ప్రవేశిస్తే.?

Ads

ఇటీవల కాలంలో థియేటర్లలో విజయం సాధించని సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్ అయ్యి,  ప్రేక్షకులను అలరించడం రివాజుగా మారింది. ప్రధానంగా హార్రర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్ లో తెరకెక్కిన చిత్రాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అదరగొడుతున్నాయి.

హార్రర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్ లో రూపొందిన ఒక తెలుగు మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. దసరా సమయంలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అంతగా ప్రమోషన్లు చేయకపోవడంతో ఈ మూవీ వచ్చిందనే విషయం చాలామందికి తెలియదు. ఓటీటీలో అలరిస్తున్న ఆ మూవీ గురించి ఇప్పుడు చూద్దాం..
హార్రర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఆ మూవీ పేరు ‘తంతిరం టేల్స్ ఆఫ్ శివకాశి చాప్టర్ 1’. ఈ చిత్రంలో శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ లీడ్ రోల్స్ లో నటించారు.ఈ చిత్రానికి ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వం వహించారు. శ్రీకాంత్‌ కంద్రుగుల బండి పతాకం పై ఈ మూవీని నిర్మించిగా, సంగీతం అజయ్ అరసాడ సమకూర్చారు. ఈ మూవీ అక్టోబర్‌ 13న థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడం, దసరాకు పెద్ద సినిమాలు రిలీజ్ సందడి ప్రారంభం కావడంతో తంతిరం మూవీ త్వరగానే థియేటర్ల నుండి మాయమైపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోస్ట్రీమింగ్‌ అవుతోంది. సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ  అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్ హక్కులను తీసుకుంది. నవంబర్‌ 11 నుండి  తంతిరం మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక తంతిరం మూవీ స్టోరీ విషయానికొస్తే, అన్యోన్యంగా ఉన్న భార్య భర్తల జీవితంలోకి ఆత్మ ప్రవేశిస్తే, ఆ జంట జీవితం ఎలా మారిపోయిందనే  పాయింట్‌ తో ఈ మూవీని తెరకెక్కించారు. మేకర్స్‌ ఈ సినిమా చివరలో దీనికి సీక్వెల్‌ ఉన్నట్లు హింట్‌ కూడా ఇచ్చారు. హార్రర్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం మంచి ఛాయిస్‌ అనవచ్చు.

Ads

Also Read: “My Name Is Shruthi” REVIEW: హన్సిక నటించిన ఈ కొత్త సినిమా ఎలా ఉంది..? స్టోరీ రివ్యూ & రేటింగ్..!

 

Previous articleరూ.2.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘హ‌లో బ్ర‌ద‌ర్’ సినిమా.. ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే, మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!
Next articleజాతకాలు కలిసినా మధ్యలోనే భార్యాభర్తలు ఎందుకు విడిపోతారు..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.