తారకరత్న మంచి నటుడు అనడానికి ఈ ఒక్క సన్నివేశం చాలు..

Ads

నందమూరి తారకరత్న హఠాత్తుగా మరణించడం నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ని మాత్రమే కాకుండా నందమూరి అభిమానులను కూడా బాధకు గురి చేస్తోంది. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి తారకరత్న ఈమధ్యే పాలిటిక్స్ లో అడుగులు వేస్తున్న ఆయన మరణం వారి కుటుంబాన్ని విషాదంలో ముంచింది.

Ads

తారకరత్నకు సంబంధించిన చాలా విషయాలు ప్రస్తుతం సామాజిక మధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన మంచి యాక్టర్ అనడానికి ఈ ఒక్క సన్నివేశం చాలని ఆయన అభిమానులు అందుకు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే, ఎన్టీరామారావు గారి తర్వాత ఆయన నట వారసత్వాన్ని నందమూరి బాలకృష్ణ కొనసాగించాడు. యాక్టర్ గా నందమూరి స్థాయిని బాలకృష్ణ ఓ రేంజ్ కు తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత బాలకృష్ణ ఎంతో ఇష్టంతో అన్నయ్య మోహన కృష్ణ కుమారుడు అయిన తారకరత్నను పరిశ్రమలోకి గ్రాండ్ గా ఎంట్రీ అయ్యేలా చేయాలని భావించాడు. అందుకు తగ్గట్టుగానే బాలయ్య ఒకే రోజు తారకరత్న 9 చిత్రాలను లాంచ్ చేయించారు.అయితే తారకరత్న ప్రారంభంలోనే 9 చిత్రాలకు సంతకం చేసినా, వాటిలో నాలుగు ఐదు చిత్రాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. మిగతా సినిమాలు చర్చల దశలోనే నిలిచిపోయాయి. అయినా తారకరత్న వెనక్కి వెళ్ళకుండా విజయం పొందడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోలేదు. విభిన్నమైన పాత్రలు చేస్తూ మంచి నటుడుగా పరిశ్రమలోనే కొనసాగాలని భావించాడు.అయితే హీరోగా ఆయన ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేదు. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో రవి బాబు ద్వారా తారకరత్నకి మంచి అవకాశం వచ్చింది. హీరోయిన్ భూమిక లీడ్ రోల్ లో నటించిన అమరావతి మూవీలో తారకరత్న సైకో క్యారెక్టర్ లో నటించాడు. అది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయినప్పటికి ఎమోషనల్ సన్నివేశాలలో అద్భుతంగా నటించి ఆడియెన్స్ తో కంటతడి పెట్టించాడు.
ముఖ్యంగా ఈ చిత్రంలో క్లైమాక్స్ సీన్స్ లో తారకరత్న నటించిన తీరు అప్పట్లో ఆడియెన్స్ ని చాలా ఆకట్టుకుంది. ఆ చిత్రానికి గాను తారకరత్నకి నంది అవార్డు అందుకున్నాడు. సినిమా చివరిలో భూమికతో తారకరత్న చేసిన ఒక సీన్ ఆయనలో మంచి నటుడు ఉన్నాడు అనడానికి ఉదాహరణ.అయితే ఆ సినీమా తర్వాత ఆ స్థాయిలో తారకరత్నకి పాత్రలు రాలేదు. అలాంటి పాత్రలు కనుక వచ్చి ఉన్నట్లయితే తారకరత్న కూడా టాలీవుడ్ లో జగపతిబాబు, ప్రకాష్ రాజ్ లాగా విలక్షణమైన నటుడిగా అయ్యేవారని ఆయన అభిమానులు స్పందిస్తున్నారు. తారకరత్న విజయవంతమైన  హీరో కానప్పటికి బ్యాడ్ పెర్ఫెమర్ మాత్రం కాదని కామెంట్స్ చేస్తున్నారు.Also Read:  ప్రాణస్నేహితుడు మరణించినా చివరి చూపుకు వెళ్ళని రజినీకాంత్.. ఎందుకో తెలుసా?

Previous articleఉదయ్ కిరణ్ గురించి షాకింగ్ విషయలు చెప్పిన మురళీ మోహన్..
Next articleభర్తలు భార్యకు అస్సలు చెప్పకూడని 4 విషయాలు..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.