Ads
నందమూరి వారసుడు, నటుడు తారకరత్నకు ఇటీవల గుండె పోటు రావడంతో ఆస్పత్రిలో చేరిన విషయం అందరికి తెలిసిందే. అయితే గుండెపోటు వచ్చినప్పటి నుండి తారకరత్న హెల్త్ కండిషన్ ఆందోళనకరంగానే ఉంది.
ఆయనను ముందుగా కుప్పంలోని స్థానిక ఆస్పత్రిలో చేర్చి, ట్రీట్మెంట్ అందిచారు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం అక్కడి నుండి బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పటల్ కి తీసుకుని వెళ్లారు. అప్పటి నుండి అక్కడే ఆయనకు అత్యాధునిక పరికరాలతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తారకరత్నకు గుండెపోటు వచ్చినప్పటి నుండి ఇప్పటి దాకా ఆయన వెంట బాబాయి బాలకృష్ణ ఉన్నారు. వైద్యానికి కావలసినవన్ని అక్కడే ఉండి సమకూరుస్తున్నారు.
Ads
ఇక తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలిసి చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే కాక నందమూరు ఫ్యామిలీ అంతా కదిలి వచ్చింది. చంద్రబాబు నాయుడు, లోకేష్, మంచు మనోజ్, విజయ సాయి రెడ్డి లాంటి వారంత బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పటల్ కి వెళ్ళి తారకరత్న ను పరామర్శించారు. అయితే ఇప్పటివరకూ తారకరత్న పూర్తిగా కోలుకోలేదు. ఆయన పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని తెలుస్తోంది.
అయితే ఆయనకు గుండెపోటు వచ్చినపుడు గుండె 45 నిమిషాల పాటు పని చేయలేదని, ఆగిపోయిందని తెలుస్తోంది. చికిత్స మొదలు పెట్టిన తరువాత తిరిగి పనిచేయడం మొదలుపెట్టిందని, బ్రెయిన్ స్కాన్ చేయగా బ్రెయిన్ ముందు బాగంలో వాపు ఉన్నట్లుగా గుర్తించినట్టు తెలుస్తోంది. తారకరత్న వారం రోజుల నుండి వెంటిలేటర్‌పైనే ఉన్నారు. గుండె బాగానే పనిచేస్తోందని చెబుతున్నారు వైద్యులు. కానీ బ్రెయిన్ వాపు రావడం ఆందోళనకు గురి చేస్తోంది. వైద్యులు మెదడును తిరిగి పని చేయడం కోసం చికిత్సను చేస్తున్నారు. పరిస్థితిని బట్టి ఆయనను విదేశాలకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరో వైపు ఆయన కోలుకోవాలని అభిమానులు, టీడీపీ నేతలు పూజలు చేస్తున్నారు.
Also Read: భీమ్లా నాయక్ సినిమా పవన్ కళ్యాణ్ కన్నా ముందు ఏ స్టార్ హీరో వద్దకి వెళ్లిందో తెలుసా?