Ads
వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆటపై పలువురు తమ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆసియా కప్ ను జరగబోయే వరల్డ్ కప్ టోర్నీలను ఒక ప్రాక్టీస్ మ్యాచ్ గా ఉపయోగించుకున్న టీం ఇండియా…పేలవమైన పర్ఫామెన్స్ తో క్రికెట్ అభిమానులను నిరాశ పరిచింది. నేపథ్యంలో ఆసియా కప్ లో టీం ఇండియా ఫైనల్ కు చేరినప్పటికి..కొని విషయాలు అభిమానులను కలవర పడుతున్నాయి.
ఆదివారం జరిగే ఆసియా కప్ 2023 ఫైనల్లో టైటిల్ కోసం భారత్, శ్రీలంక తలపడనున్నాయి. అయితే అమీ తుమీ తేల్చుకోవాల్సిన ఫైనల్ కి ముందు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది.సూపర్ 4 మాచ్ లలో జరిగిన లాస్ట్ ఆట లో ప్రత్యర్థి జట్టు బంగ్లాదేశ్ నిర్దేశించిన 266 పరుగుల లక్ష్యాన్ని సాధించే క్రమంలో 259 పరుగులకు ఆలౌటై అయిపోయింది.
Ads
అయితే ఎన్నడూ లేనిది ఈ సారి ఆసియా కప్ లో భారత్ టీం లో ఒకరు.. ఇద్దరూ కాదు…ఏకంగా నలుగురు ఆల్ రౌండర్లు ఆడుతున్నారు. అందులో ఒకరు బ్యాటింగ్ ఆల్ రౌండర్….ముగ్గురు బౌలింగ్ ఆల్ రౌండర్లు ఉన్నారు. అయితే ఒక హార్దిక్ పాండ్యా తప్ప మిగిలిన ముగ్గురు అల్ రౌండర్లు…నామమాత్రం గానే పెర్ఫాం చేశారు.
ఏదో సాధిస్తాడు అని అనుకున్న రవీంద్ర జడేజా బౌలింగ్ లో పర్వాలేదు అనిపించుకున్నా…బ్యాటింగ్ లో మాత్రం పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతను మోతం మూడు మ్యాచ్ లలో బ్యాటింగ్ చేయగా రెండు మ్యాచ్లలో సింగిల్ ఫిగర్స్ కోర్స్ సాధించగా ఒక్క మ్యాచ్లో కష్టపడి 14 రన్స్ చేశాడు. బౌలింగ్ పరంగా తీసుకుంటే.. 6 వికెట్లు మాత్రమే తీశాడు.
శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ సూపర్ అని షమీని కాదు అని శార్దుల్ కు అవకాశం ఇచ్చారు…కానీ అతని ఆటతీరు ఆశించిన రేంజ్ లో మాత్రం లేదు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఆట కనబరుస్తాడు అనుకుంటే.. అదీ లేదు. ఇంకో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ లో రాణిస్తున్నప్పటికీ బౌలింగ్ లో నిరాశ పరుస్తున్నాడు. ఇదే రకమైన ప్రదర్శన రేపు వరల్డ్ కప్ లో కూడా వీళ్ళు కనబరిస్తే ఇక ఇండియా కప్పు గెలిచినట్టే..