Ads
ప్రపంచ కప్ 2023 టోర్నీ ఫైనల్లో ఇండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. అహ్మదాబాద్ లో జరుగనున్న ఈ గ్రాండ్ ఫినాలే నవంబర్ 19 జరగనుంది. భారత జట్టు ఈ ప్రపంచకప్ టోర్నీలో ఆరంభం నుండి సెమీ ఫైనల్ వరకు విజయాలు సాధిస్తూ, అద్భుతమైన ఫామ్ లో ఉంది.
భారత్ లీగ్ స్టేజ్ లో 9 మ్యాచ్ లు ఆడి, అన్ని గెలిచింది. సెమీస్ లో న్యూజిలాండ్ ప్రతిఘటించినా షమీ బౌలింగ్ వల్ల గెలిచి, ఫైనల్ కి చేరుకుంది. అయితే భారత్ ఒక విషయం భయపెడుతుంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం..
ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలో భారత్ నాలుగోసారి ఫైనల్ లో అడుగుపెట్టింది. సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ తో ఆడిన మ్యాచ్ లో 70 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఆ తరువాతి రోజు జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఫైనల్ కు చేరుకుంది. ఆసీస్ ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టడం ఇది 8వసారి. ఫైనల్ మ్యాచ్ కు ముందు భారత్ బౌలింగ్ అంశంలో భయపడుతోంది.
హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరం అయినప్పటి నుండి ఐదుగురు బౌలర్లతో ఆడుతోంది. అయితే లీగ్ స్టేజ్ లో అంతగా ఇబ్బందులు ఎదురుకనప్పటికి, సెమీ ఫైనల్ మ్యాచ్ లో బౌలింగ్ విషయంలో భారత్ ఇబ్బంది పడింది. ఈ జట్టులో ఐదుగురు బౌలర్లు మాత్రమే ఉన్నారు. ఇంకో బౌలింగ్ ఆప్షన్ లేదు. కోహ్లీ, సూర్యకుమార్ , రోహిత్ , శుబ్ మన్ గిల్ లు నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేసినప్పటికీ, ఫైనల్ మ్యాచ్ లో వీరు బౌలింగ్ చేయడం సందేహమే.
అందువల్ల టీమిండియా 50 ఓవర్లను బుమ్రా, షమీ,సిరాజ్, జడేజా, కుల్దీప్ లే వేయాల్సి ఉంటుంది. ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా, ఆడబోతున్నది 5 సార్లు చాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియాతో, వారి జట్టులోని ప్లేయరలందరు మ్యాచ్ విన్నర్లే. అదీకాక 2 వరుస అపజేయల తర్వాత వరుస మ్యాచ్ లలో గెలుస్తూ, ఫైనల్ కు చేరుకున్నారు. అలాంటి జట్టుతో ఫైనల్లో ఆడుతున్నప్పుడు టీమిండియా ఐదుగురు బౌలర్లతో కాక ఆరుగురు బౌలర్లతో మ్యాచ్ లోకి దిగితేనే మంచిదని సూచిస్తున్నారు.
Ads
Also Read: శుభమన్ గిల్ ని రిటైర్డ్ హర్ట్ అవ్వమని.. అశ్విన్ తో రోహిత్ పంపిన మెసేజ్ వెనక ఇంత ప్లాన్ ఉందా..?