Ads
సంక్రాంతి పండుగకి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉండనుంది. ఈసారి ఏకంగా 5 చిత్రాలు విడుదల కానున్నాయి. వాటిలో నాలుగు స్టార్ హీరోల సినిమాలు ఉండగా, ఒకటి యంగ్ హీరో మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.
అయితే ఈ చిత్రాలలో ముందుగా చెప్పుకోవాల్సింది సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ మూవీ సినిమా గురించే. అయితే అదే రోజున ఆ మూవీకి పోటీగా హనుమాన్ రిలీజ్ కానుంది. ఈ చిత్ర హీరో ఒకప్పుడు మహేష్ కుమారుడిగా నటించగా, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మహేష్ తో పోటీ పడుతున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సంక్రాంతి పండుగకి టాలీవుడ్ లో తప్పనిసరిగా నాలుగు లేదా ఐదు చిత్రాలు రిలీజ్ అవడం సర్వ సాధారణం. ఈ సంక్రాంతికి కూడా 5 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడబోతున్నాయి. థియేటర్లు ప్రేక్షకులతో కలకలలాడబోతున్నాయి. ఈ 5 సినిమాలలో భారీగా అంచనాలు ఉన్న సినిమా అంటే అది మహేష్ నటిస్తున్న గుంటూరు కారం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ ప్రకటించినప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
కానీ కొందరు మూవీని నుండి తప్పుకోవడం, పలుమార్లు షూటింగ్ వాయిదా పడడంతో మూవీ పై ఫ్యాన్స్ కూడా ఆశలు వాడులుకున్నారు. ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, మహేష్ లుక్ ఈ చిత్రం పై అంచనాలను పెంచింది. ఈ మూవీ జనవరి 12న రిలీజ్ కానుంది. అదే రోజు ప్రశాంత్ వర్మ దర్శకటవంలో తేజ సజ్జ నటించిన హనుమాన్ రిలీజ్ కానుంది. దీంతో ఈ మహేష్, తేజ గురించిన వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
మహేష్ బాబు హీరోగా నటించిన రెండవ చిత్రం యువరాజు. ఈ మూవీలో మహేష్ కొడుకుగా తేజ సజ్జ నటించాడు. తేజ పలు చిత్రాలలో బాలనటుడిగా నటించాడు. ఇప్పుడు హీరోగా మారిన తేజ మహేష్ కు పోటీగా వస్తున్నాడు అని పలు వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి. వీటి పై తేజ సజ్జ స్పందిస్తూ, సూపర్ స్టార్ తో పోటీ ఏంటి, ఆయనతో పోటీగా కాదు. ఆయనతో పాటుగా అంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Ads
Also Read: “జయం” సినిమాలో సదా చెల్లి గుర్తుందా.? ఆ అమ్మాయి ఇప్పుడెలా ఉందో..ఏం చేస్తుందో తెలుసా?