TS ELECTIONS 2023: తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తున్న ఈ 6 మంది అభ్యర్థుల అసలు పేర్లు ఏమిటో తెలుసా..?

Ads

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2,898 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎలెక్షన్ సంఘం ఆమోదించగా,  606 నామినేషన్లను ఎలెక్షన్ ఆఫీసర్లు తిరస్కరించారు. పోటీ చేసే అభ్యర్థులందరూ నామినేషన్లలో తమ పేర్లను పొందుపరచడం తెలిసిందే. అయితే కొందరి నామినేషన్లలో అసలు పేరు మరియు వ్యవహారికంలో ఉన్న పేర్లను కూడా పొందుపరిచారు. వీరంతా అసలు పేర్లతో కాకుండా వేరే పేర్లతో ప్రసిద్ధి పొందారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..
1. పోచారం శ్రీనివాస్‌రెడ్డి: 

బాన్సువాడ నుండి పోటీ చేస్తున్న భారాస పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి. ఆయన అసలు పేరు పరిగె శ్రీనివాస్‌రెడ్డి. శ్రీనివాస్‌రెడ్డి సొంతూరు బాన్సువాడ మండలంలోని పోచారం. ఊరి పేరే శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపేరుగా మారింది.2. రసమయి బాలకిషన్‌:

మానకొండూర్‌ భారాస అభ్యర్థి రసమయి బాలకిషన్‌ అందరికీ సుపరిచితులే. ఆయన అసలు పేరు ఇరుపుల బాలకిషన్‌. రసమయి సాంస్కృతిక సంస్థను బాలకిషన్‌ స్థాపించారు. అప్పటి నుండి ఆ సంస్థ పేరే ఆయన ఇంటి పేరుగా మారింది.
3. పద్మా దేవేందర్‌రెడ్డి: 

Ads

మెదక్‌ నుండి పోటీ చేస్తున్న భారాస పార్టీ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి, అసలు పేరు మాధవరెడ్డిగారి పద్మ. అయితే ఆమె భర్త పేరుతో కలిపి పద్మా దేవేందర్‌రెడ్డిగా పాలిటిక్స్ లో గుర్తింపు తెచ్చుకున్నారు.
4. సీతక్క: 

ములుగు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దనసరి అనసూయ.. సీతక్కగా ప్రాచుర్యం పొందింది. ఆమె నక్సలిజంలో పనిచేసినపుడు సీతక్కగా పేరు పొందారు. అదే పేరుతో రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారు.
5. మధు యాష్కీ గౌడ్:

ఎల్‌.బి.నగర్‌ నుండి కాంగ్రెస్‌ పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థి మధు యాష్కీ గౌడ్. ఆయన అసలు పేరు మధుసూదన్‌.
6. బోగ శ్రావణి: 

జగిత్యాల భాజపా అభ్యర్థి బోగ శ్రావణి, ఆమె నామినేషన్స్ పత్రాల్లో ఆమె ఇంటి పేరు బండారు శ్రావణిగా నామినేషన్ వేశారు. అయితే ఆమె భర్త ఇంటి పేరుతో బోగ శ్రావణిగా ప్రాచుర్యం పొందారు.
Also Read: తెలంగాణ అసెంబ్లీ ఎలెక్షన్స్ లో 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు ఎవరు..?

Previous articleహీరోయిన్ “రాధ”కి ఇన్ని వందల కోట్ల ఆస్తి ఉందా..? వ్యాపారాలు కుడా..?
Next articleDhootha Web Series Review: నాగ చైతన్య “దూత” వెబ్ సిరీస్ ఎలా ఉంది.? స్టోరీ, రివ్యూ & రేటింగ్!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.