Ads
తెలంగాణ అసెంబ్లీ ఎలెక్షన్ల పోలింగ్ గురువారం నాడు కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు.
అయితే 5గంటల వరకూ పోలింగ్ సెంటర్లలో క్యూ లో నిల్చున్నవారికి ఎన్నికల సంఘం ఆఫీసర్లు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఇక పోలింగ్ పూర్తయిన తరువాత వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ను వెల్లడించాయి. వాటి ప్రకారం గెల్చేది ఏ పార్టీనో ఇప్పుడు చూద్దాం..
పోల్ స్ట్రాట్ సర్వే..
Ads
- కాంగ్రెస్ 49-59
- బీఆర్ఎస్ 48-58
- బీజేపీ 5-10
- ఎంఐఎం – ఇతరులు 6-8సీఎన్‌ఎన్ ఎగ్జిట్ పోల్స్:
- బీఆర్‌ఎస్ 48
- కాంగ్రెస్‌కు 56
- బీజేపీకి 10
- ఎంఐఎం 5చాణక్య స్ట్రాటజిస్ ఎగ్జిట్ పోల్స్:
- బీఆర్‌ఎస్ 22-31
- కాంగ్రెస్‌కు 67-78
- బీజేపీకి 6-9
- ఎంఐఎం 6-7ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్:
- బీఆర్‌ఎస్ 41-49
- కాంగ్రెస్‌కు 48-67
- బీజేపీకి 5-7
- ఎంఐఎం 6-7
- ఇతరులు 2జన్‌కీబాత్ ఎగ్జిట్ పోల్స్:
- బీఆర్‌ఎస్ 40-55
- కాంగ్రెస్‌కు 48-64
- బీజేపీకి 7-13
- ఎంఐఎం 4-7
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్: - బీఆర్‌ఎస్ 35-46
- కాంగ్రెస్‌కు 62-72
- బీజేపీకి 3-8
- ఎంఐఎం 6-7
- ఇతరులు 1-2సీ ప్యాక్ ఎగ్జిట్ పోల్స్:
- బీఆర్‌ఎస్ 41
- కాంగ్రెస్ 65
- బీజేపీకి 4
- ఎంఐఎం 4
- ఇతరులు 4తెలంగాణ అసెంబ్లీ ఎలెక్షన్ల పై సుమారు 20 దాకా సర్వే సంస్థలు వారు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశారు. అయితే వాటిలో పదిహేనుకు పైగా సర్వేలు ఈ అసెంబ్లీ ఎలెక్షన్స్ లో కాంగ్రెస్ ముందుంజలో ఉన్నట్టుగా వెల్లడించాయి. కొన్ని సంస్థలు మాత్రమే అధికార పార్టీ బీఆర్‌ఎస్‌దే విజయం అని తెలిపాయి. ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు కాంగ్రెస్ కంటే బీఆర్‌ఎస్ వెనుకబడిందని వెల్లడించడంతో తుది ఫలితాల్లో కూడా ఇదే నిజమయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ పండితులు సైతం అభిప్రాయడుతున్నారు.
Also Read: TS ELECTIONS 2023: తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తున్న ఈ 6 మంది అభ్యర్థుల అసలు పేర్లు ఏమిటో తెలుసా..?