Ads
తెలంగాణలో ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ ఘనవిజయాన్ని సాధించింది. ప్రస్తుతం ముఖ్య మంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అయితే ఐటి మినిస్టర్ ఎవరు అవుతారు అన్న ప్రశ్న తెలంగాణలో సర్వత్రా వినిపించింది. దీనికి సమాధానంగా వినిపించిన పేరే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు.
తెలంగాణ ఆవిర్భావం నుంచి ఐటి మినిస్టర్ గా కొనసాగిన కేటీఆర్ కు దీటుగా.. తెలంగాణ యువత నమ్మకాన్ని గెలుపొందే వ్యక్తి కాంగ్రెస్ లో ఉన్నారా అన్న డౌట్ అక్కడక్కడ వినిపించింది. అయితే శ్రీధర్ బాబు రాజకీయ ప్రస్థానం గురించి తెలిస్తే అటువంటి డౌట్ ఉత్పన్నం కాదు అంటున్నారు కాంగ్రెస్ వర్గం.
తాజాగా మంత్రివర్గంలోకి ఎంపికైన శ్రీధర్ బాబు.. కాంగ్రెస్ పార్టీ తరఫున మంథని నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఇంతకుముందు ఆయన ఎక్కడ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రికార్డు ఉంది. 1999 అసెంబ్లీ ఎలక్షన్స్ లో మొదటిసారి ఇక్కడ నుంచి గెలుపొందిన శ్రీధర్ బాబు ఆ తర్వాత..2004, 2009, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
Ads
అంతేకాకుండా 2004 నుంచి 2019 మధ్యకాలంలో ప్రభుత్వ చీఫ్ విప్ గా కూడా ఉన్నారు. 2014లో మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా బాధ్యతలు వహించారు. ప్రస్తుతం ఈయన తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో ఉపాధ్యక్షుడిగా తన బాధ్యతను నిర్వహిస్తున్నారు. 9 మార్చి,1969 న కాటారం మండలం, జయశంకర్ జిల్లా లోని ధన్వాడ గ్రామం లో శ్రీధర్ బాబు జన్మించారు. 1998లో ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదిగా తన వృత్తిని మొదలుపెట్టారు. శ్రీధర్ బాబు వివాహం శైలజ రమ్య తో జరిగింది.
శైలజ.. ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ దేవ్ కార్పొరేషన్ లిమిటెడ్ కు వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. న్యాయవాదిగా కొనసాగుతున్న సమయంలో 1999లో అనుకోకుండా శ్రీధర్ బాబు తండ్రి చనిపోయారు. ఇక తండ్రి వారసుడిగా అప్పటినుంచి శ్రీధర్ బాబు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఇప్పటివరకు మంథని నియోజకవర్గ కి తన సేవలు అందించారు.
ALSO READ : ముందు ఉద్యమం… తర్వాత లాయర్… ఇప్పుడు తెలంగాణ మంత్రి..! సీతక్క ప్రజాప్రస్థానం గురించి తెలుసా..?