Ads
మనం ఎక్కడ పుట్టాం అన్నదానికన్నా కూడా ఎక్కడ పేరు సంపాదించుకున్నాం అన్నదే ఎక్కువ ముఖ్యం. మన సినిమా ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు లేరు అనుకుంటాం కానీ, ఇక్కడ పుట్టిన ఎంతోమంది వేరే భాష ఫిల్మ్ ఇండస్ట్రీలలో గుర్తింపు సంపాదించుకున్నారు. అలా ఇక్కడ పుట్టి వేరే ఇండస్ట్రీ లో గుర్తింపు సంపాదించుకున్న కొంతమంది నటులు ఎవరంటే.
#1 దియా మీర్జా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దియా మీర్జా హైదరాబాద్ లో పుట్టారు.
#2 శ్రీ దివ్య
బస్ స్టాప్, మనసారా, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, కేరింత లాంటి ఎన్నో చిత్రాల్లో నటించారు శ్రీదివ్య. ప్రస్తుతం తమిళ సినిమాల్లో నటిస్తున్నారు.
#3 జానీ లివర్
హిందీలో స్టార్ కమెడియన్ అయిన జానీ లివర్ కనిగిరి లో పుట్టారు.
#4 జయం రవి
బావ బావమరిది, పల్నాటి పౌరుషం, శుభమస్తు వంటి సినిమాలను నిర్మించిన ఎడిటర్ మోహన్ కొడుకు జయం రవి. జయం రవి తమిళ్ లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.
#5 విశాల్
ప్రముఖ నిర్మాత జీకే రెడ్డి కొడుకు విశాల్. విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశాల్ నటించిన తమిళ సినిమాలు అన్ని తెలుగులో కూడా విడుదలవుతాయి. ఎందుకంటే తెలుగులో కూడా విశాల్ కి మంచి గుర్తింపు లభించింది.
Ads
#6 ఆనంది
రక్షిత పేరుతో ఆట జూనియర్స్ లో పాటిస్పేట్ చేసింది. తర్వాత ఈ రోజుల్లో, బస్ స్టాప్ సినిమాల్లో నటించింది. తర్వాత ఆనంది అని పేరు మార్చుకుంది. ప్రస్తుతం తమిళ సినిమాల్లో నటిస్తోంది.
#7 శ్రీరామ్
ఒకరికి ఒకరు, దడ, లై సినిమాల్లో నటించారు. శ్రీరామ్ తెలుగు కంటే ఎక్కువ తమిళ్ సినిమాల్లో నటిస్తున్నారు.
#8 వైభవ్
గొడవ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైభవ్, కోదండరామి రెడ్డి గారి కొడుకు. తర్వాత సరోజ, మంగత (తెలుగులో గ్యాంబ్లర్), ఇంకా ఎన్నో సినిమాల్లో నటించారు.
#9 సమీరా రెడ్డి
అశోక్, జై చిరంజీవ, నరసింహుడు చిత్రాల్లో నటించిన సమీరా రెడ్డి రాజమండ్రి లో పుట్టారు.
#10 జీవా
డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రజలకు చేరువైన జీవా, మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి.చౌదరి కొడుకు.
#11 అదితి రావు హైదరి
ప్రస్తుతం వి సినిమాతో మన ముందుకు రాబోతున్న అదితి రావు హైదరి హైదరాబాద్ లో పుట్టారు.
#12 శోభిత ధూళిపాళ
గూడచారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శోభిత తెనాలి లో పుట్టారు.