టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ఎంత సంపాదిస్తారో తెలుసా..?

Ads

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ప్రతి ఒక్కరికీ డబ్బు సంపాదించే సాధనంగా మారింది. ఈ మధ్యకాలంలో డిజిటల్‌గా సంపాదించడం అనేది సాధారణ విషయం అయిపోయింది. ఈ విషయంలో సినీ సెలబ్రిటీలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే వారు స్పాన్సర్ చేసిన పోస్ట్‌లను షేర్ చేయడం ద్వారా మిలియన్ల కొద్దీ సంపాదిస్తున్నారు. వారిని ఫాలోవుతున్న భారీ అభిమానులే ఇందుకు కారణం. దీనికి సౌత్ సెలెబ్రెటీలు మినహాయింపు కాదు. సమంత నుండి రష్మిక మందన్న వరకు, విజయ్ దేవరకొండ వంటి హీరోలు కూడా ఇన్‌స్టాగ్రామ్ ఒక్కో పోస్ట్‌కు ఎంత సంపాదిస్తున్నారో ఇప్పుడు చూద్దాం..
1. సమంత:

సమంత గురించి పరిచయం అవసరం లేదు. ఆమె సౌత్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన అగ్ర హీరోయిన్లలో ఒకరు. సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో 31.8 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు. నివేదిక ప్రకారం, ఆమె ప్రతి ఎండార్స్‌మెంట్ పోస్ట్‌కి రూ.50 – 70 లక్షల వరకు సంపాదిస్తుంది.

2. కాజల్ అగర్వాల్:

Ads

భగవంత్ కేసరి మూవీతో రీఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా 27.1 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ఆమె తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రతి ప్రచార పోస్ట్‌కి 50 లక్షల వరకు సంపాదిస్తుంది.
3. రష్మిక మందన్న:

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం సౌత్అ, నార్త్ లలో ప్రముఖ హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు. సౌత్ లో  అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఆమె కూడా ఉన్నారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 41.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఒక్కో ప్రమోషనల్ పోస్ట్‌ ల ద్వారా రూ. 30 నుంచి 50 లక్షల వరకు సంపాదిస్తుంది.
4. విజయ్ దేవరకొండ:

రౌడీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో 20.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ హీరో ఒక ప్రోడక్ట్  ప్రమోషన్ కోసం కోటి రూపాయలు పారితోషికం తీసుకుంటాడని తెలుస్తోంది.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా నెలకు కోట్లలో సంపాదన ఉంటుందని తెలుస్తోంది.

Also Read: రకుల్ ప్రీత్ పెళ్లి గోవాలో.. ప్రధానిమోదీ చెప్పడం వల్లేనా..?

 

 

 

Previous articleఅంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాకి అసలు హీరో ఈ నటి ఏమో..! సినిమా మొత్తానికి హైలైట్ అయ్యారు..!
Next articleఈ సీన్ యాడ్ చేసి ఉంటే…”హనుమాన్” సినిమాకి థియేటర్ లో రెస్పాన్స్ మాములుగా ఉండేది కాదు.!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.