తొలి సినిమా హిట్ అయిన సినిమాలకు దూరమైన 10 మంది హీరోయిన్స్..

Ads

సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు విజయవంతంగా కెరిర్ ను కొనసాగించడం అనేది చాలా కష్టమైన విషయం. ఈ రంగుల ప్రపంచంలో ఛాన్సులు దొరకాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక హీరోయిన్లకు అయితే గ్లామర్ ఉన్న వాళ్ళకే హీరోయిన్ ఛాన్స్ వస్తుంది.

అయితే కొంతమంది హీరోయిన్స్ కు గ్లామర్ ఉన్న కానీ, అదృష్టం కలిసి రాక కొందరు, మరికొందరు ఇతర కారణాలతో తొలి సినిమాతో హిట్ వచ్చినా, ఒకటి రెండు సినిమాలు చేసి సినిమాలకి దూరమయ్యారు. మరి అలా తొలి సినిమాతో మంచి హిట్ అందుకొని, ఆ తరువాత తక్కువ సమయంలోనే సినీ పరిశ్రమకి దూరమైన హీరోయిన్ల ఎవరో ఇప్పుడు చూద్దాం.

Ads

  1. రిచా:
    నువవేకావాలి లాంటి సూపర్ హిట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా, ఆ తరువాత కొన్ని సినిమాలలో నటించి ఇండస్ట్రీకి దూరం అయ్యింది.

2. అన్షు:
నాగార్జునతో మన్మధుడు, ప్రభాస్ తో రాఘవేంద్ర సినిమాలలో నటించింది. ఆ తరువాత మళ్ళీ కనిపించలేదు.
3. షామిలి:
బేబీ షామిలి ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. బాలనటిగా చాలా సినిమాలలో నటించింది. ఆ తరువాత షామిలి సిద్దార్ధ్ హీరోగా నటించిన ‘ఓయ్’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ సినిమా తరువాత మళ్ళీ నటించలేదు.
4. కార్తీక:
కార్తీక సీనియర్ హీరోయిన్ రాద కూతురిగా నాగచైతన్య మొదటి సినిమా ‘జోష్’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కార్తీక జూనియర్ ఎన్టీఆర్ ‘దమ్ము’ సినిమాలో నటించిన, ప్రస్తుతం బుల్లితెరకి పరిమితమైంది.
5. శియా గౌతమ్:
రవితేజ హీరోగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన నేనింతే మూవీతో హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం మూవీలో నటించింది. ఇక ఆ తరువాత సినిమాలలో నటించలేదు.
6. నేహా శర్మ:
రామ్ చరణ్ హీరోగా చేసిన తొలి సినిమా ‘చిరుత’ లో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా తరువాత అవకాశాలు వచ్చిన నిలబెట్టుకోలేకపోయింది.
7. గౌరీ ముంజల్:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘బన్నీ’ చిత్రంలో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కానీ ఆమె ఆ తరువాత సినిమాలలో కనిపించలేదు.
8. మీరా చోప్రా:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘బంగారం’ మూవీతో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా ప్లాప్ అవడంతో ఈమెకు అవకాశాలు రాలేదు.
9. అనురాధ మెహత:
అల్లు అర్జున్ తో ఆర్య సినిమాలో నటించిన ఈ హీరోయిన్, ఆ తరువాత ఎక్కువగా నటించలేదు.
10. భాను శ్రీ మెహ్రా:
అల్లు అర్జున్ నటించిన ‘వరుడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  ఆ తరువాత సినిమాలలో నటించలేదు. Also Read: 2022 లో పాజిటివ్ టాక్ వచ్చినా కూడా విజయం పొందని 10 సినిమాలు..

 

Previous articleప్రేయసికి పిల్లర్ నెంబర్ 9 అని పేరు పెట్టిన అబ్బాయి.. రైల్వేస్టేషన్ లవ్ స్టోరీ
Next articleసూపర్ స్టార్ రజినీకాంత్ వదులుకున్న తెలుగు సినిమా ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.