Ads
ప్రతి ఊరిలోనూ ప్రతి వీధిలోను విగ్రహాలు ఉంటూ ఉంటాయి. రకరకాల విగ్రహాలని ఊర్లలో ప్రతిష్టిస్తూ ఉంటారు. గొప్ప గొప్ప నాయకుల విగ్రహాల నుండి దేవుళ్ళ విగ్రహాల వరకు చాలా విగ్రహాలను మనం చూస్తూ ఉంటాం. అయితే మన భారతదేశంలో ఉన్న పొడవైన విగ్రహాల గురించి మీకు తెలుసా..? మన భారత దేశంలో ఉండే విగ్రహాలన్నిటికంటే పొడవైనవి ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈ టాప్ 10 పొడవైన విగ్రహాలు జాబితా ఇప్పుడు చూద్దాం.
- స్టాట్యూ ఆఫ్ యూనిటీ, 597 అడుగులు:
స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం గుజరాత్ లో ఉన్న విషయం తెలిసిందే. గుజరాత్ లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అన్నిటికంటే పొడవైన విగ్రహం. మన భారతదేశంలో ఉండే విగ్రహాలు అన్నిటిలోనూ అత్యంత పొడవైనది స్టాట్యూ ఆఫ్ యూనిటీ. భారతీయ శిల్పి రామ్ వి సుతార్ ఈ విగ్రహాన్ని చెక్కారు.
2. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, 216 అడుగులు:
హైదరాబాద్ కి 36 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. చినజీయర్ ట్రస్ట్ ముచింటల్ రంగారెడ్డి జిల్లాలో ఇది ఉంది. ఈ విగ్రహం 11వ శతాబ్దం నాటి వైష్ణవతి రామానుజన్ని సూచిస్తుంది. మన ఇండియాలో ఉండే టాప్ 10 పొడవైన విగ్రహాలలో ఇది రెండవది.
3. హనుమంతుడి విగ్రహం, 171 అడుగులు:
చాలా చోట్ల హనుమంతుని విగ్రహాలని మీరు చూసే ఉంటారు కానీ ఇది చాలా పొడవైన విగ్రహం. శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ లో ఈ విగ్రహం ఉంది. ప్రపంచంలోకెల్లా ఎత్తైన హనుమంతుడి విగ్రహం ఇది. ఇండియాలో ఉండే పొడవైన విగ్రహాల్లో ఇది మూడవ స్థానంలో ఉంది.
4. పంచముఖి హనుమాన్ విగ్రహం, 161 అడుగులు:
ఇది కర్ణాటకలో ఉంది ఈ హనుమంతుడి విగ్రహానికి ఐదు ముఖాలు ఉంటాయి. అందుకే పంచముఖి అంటారు. ఇండియాలో ఉండే పొడవైన విగ్రహాలన్నిటిలో ఇది నాలుగో ప్లేస్ ని పొందింది.
Ads
5. లార్డ్ మురుగన్ విగ్రహం, 146 అడుగులు:
తమిళనాడు లోని సలీం జిల్లాలో ఇది ఉంది. ఇండియాలో ఉండే పొడవైన విగ్రహాలలో ఇది ఐదవది. చాలా మంది ఇక్కడకి వెళ్తూ వుంటారు.
6. వైష్ణవ దేవి విగ్రహం, 141 అడుగులు:
బృందావన్ ఉత్తరప్రదేశ్లో మా వైష్ణవో దేవి విగ్రహం ఉంది. దీని ఎత్తు వచ్చేసి 141 అడుగులు. మన ఇండియా లో పొడవైన విగ్రహాలన్నిటిలో ఇది ఆరవ ప్లేస్ ని పొందింది.
7. వీర అభయ ఆంజనేయ హనుమాన్ స్వామి విగ్రహం, 135 అడుగులు:
ఇది విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ లో ఉంది. ప్రపంచంలోకెల్లా ఎత్తైన హనుమంతుడు విగ్రహాలలో ఇది రెండవ స్థానంలో ఉంది. మొదటిది శ్రీకాకుళం జిల్లా లో వుంది. మన భారత దేశంలో పొడవైన విగ్రహాల్లో ఇది ఏడవ స్థానంలో ఉంది.
8. తిరువవళువర్ విగ్రహం, 133 అడుగులు:
తమిళ కవి ఫిలాసఫర్ వళువార్ విగ్రహం ఇక్కడ ఉంది దీని పొడవు 133 అడుగులు. ఈయన తిరుకుర్రల్ రచన చేశారు. కన్యాకుమారి తమిళనాడులో ఇది ఉంది.
9. తతగట స్థల్, 128 అడుగులు:
రవంగలా కి సమీపం లో సౌత్ సిక్కిం జిల్లాలో ఇది ఉంది. బుద్ధ పార్క్ రవంగల అనీ తతగట స్థల్ అనీ దీన్ని అంటారు. 128 అడుగులు ఉంటుంది.
10. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం , 125 అడుగులు:
హైదరాబాదులో కొత్తగా దీన్ని ప్రతిష్టించారు ఈ అంబేద్కర్ విగ్రహం 125 అడుగులు వుంది. మన ఇండియాలో ఉండే విగ్రహాల్లో ఇది పొడవైన విగ్రహంగా పదవ స్థానంలో ఉంది. దేశ రాజ్యాంగ నిర్మాత, భావి భారత స్ఫూర్తిప్రదాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 132 వ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఆవిష్కరించారు. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఇది.