Ads
పండగ హడావిడి తగ్గింది కాబట్టి ఈవారం చాలా చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాయి. అలా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ‘కీడా కోలా’. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ క్రైమ్ కామెడీ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో తెలుసుకుందాం.
- మూవీ: కీడా కోలా
- నటీనటులు: చైతన్య మందాడి, రాగ్ మయూర్, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, జీవన్ కుమార్, విష్ణు, రవీంద్ర విజయ్, రఘురామ్
- డైరెక్టర్: తరుణ్ భాస్కర్
- మ్యూజిక్: వివేక్ సాగర్
- సినిమాటోగ్రఫీ: ఏజే అరోన్
- నిర్మాత: కె.వివేక్ సుధాంశు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్, కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందరాజ్, ఉపేంద్ర వర్మ
- సమర్పణ: రానా దగ్గుబాటి
- రిలీజ్ తేది : నవంబర్ 3, 2023
స్టోరీ:
వాస్తు (చైతన్యరావు), అతని తాత వరదరాజు( బ్రహ్మానందం) , లాయర్ కౌశిక్ (రాగ్ మయూర్).. ఈ ముగ్గురికి బాగా డబ్బు సంపాదించాలి అన్న బలమైన ఆశ ఉంటుంది. తాత కోసం తెచ్చిన కూల్ డ్రింక్ కీడా కోలా బాటిల్ లో బొద్దింక కనిపిస్తుంది. ఇక అది చూపించి కంపెనీ ఓనర్ ని బ్లాక్ మెయిల్ చేసి ఎలాగైనా ఒక ఐదు కోట్లు అతని నుంచి తీసుకోవాలి అన్న కాన్సెప్ట్ తో కథ మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి బేరసారాలు మొదలవుతాయి. మరోపక్క జీవన్ కు కార్పొరేటర్ కావాలి అన్న ఆశ పట్టుకుంటుంది. అందుకే అతను 20 ఏళ్ల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన అన్న నాయుడు ( తరుణ్ భాస్కర్) సహాయం తో ప్రయత్నాలు మొదలు పెడతాడు.
Ads
జీవన్ కార్పొరేటర్ కావాలి అంటే డబ్బులు కావాలి. ఇక దీనికోసం జీవన్ బ్యాచ్ సరికొత్త వ్యూహాన్ని పన్నుతారు. ఇలా ఎవరికి వాళ్లు డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తారు. ఇంతకీ వీళ్ళ ప్రయత్నాలు ఫలించాయా ?డబ్బు సంపాదించారా ?వాస్తు బ్యాచ్ కి జీవన్ కి మధ్య లింకు ఎలా కుదిరింది? కోలా బాటిల్లో బొద్దింక ఎలా వచ్చింది ?ఫైనల్ గా ఏం జరిగింది? తెలియాలి అంటే సినిమా చూడాలి.
విశ్లేషణ:
‘కీడా… ఇందులో ఉంది తేడా’ అనే క్యాచీ టైటిల్ తో ఉండే ఈ సినిమా ట్యాగ్ లైన్ లాగానే ఇందులో పాత్రలు కూడా కొన్ని తేడాగా ఉంటాయి. కామెడీగా సాగే ఒక క్రైమ్ స్టోరీ మనకు గమ్మత్తయిన అనుభవాన్ని ఇస్తుంది. తమాషా అయిన పాత్రలు పాత్రలు, కోరికలు, డబ్బు సంపాదించుకోవడానికి లాజిక్ లేని ప్రయత్నాలు.. ఇలా నవ్విస్తూ సాగుతుంది ఈ మూవీ. యాక్టర్స్ అందరూ అద్భుతంగా నటించారు.
డైరెక్టర్ తన మొదటి రెండు సినిమాలు ఫుల్ లాజిక్ తో చేసినప్పటికీ..ఈ సారి లాజికల్ అన్ని పక్కన పెట్టి కేవలం కామెడీ తోటే కడుపుబ్బ నవ్వించాడు తరుణ్ తీసిన ఫస్ట్ క్రైమ్ కామెడీ మూవీ కీడా కోలా.. ప్రేక్షకుల మనసు మెప్పించే లాగానే కనిపిస్తోంది. కథా, కథనం తో పాటు పాత్రల మధ్య ఎమోషన్స్ ని కూడా డైరెక్టర్ బాగా చూపించాడు. ఇందులో జీవన్ పోస్టర్ కొత్త ప్రయోగం అనే చెప్పాలి.
ప్లస్ పాయింట్స్:
- కామెడీ యాంగిల్ చాలా బాగుంది.
- నటీనటులు క్యారెక్టర్ కి తగినట్టుగా ఎక్సలెంట్ గా నటించారు.
- లాజిక్ పక్కన పెట్టి ఈ మూవీ మ్యాజిక్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చు.
మైనస్ పాయింట్స్:
- స్టోరీ ఈజీగా గెస్ చేసే విధంగా ఉంది.
రేటింగ్: 2.5/5
చివరి మాట:
లాజికల్ గురించి పెద్దగా ఆలోచించకుండా కామెడీ ఫ్లో లో వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళకి ఈ మూవీ మంచి ఎంటర్టైనర్.