Ads
సినీ ఇండస్ట్రీలో ఓ రేంజ్ హీరోలు కొంతకాలం వరకు బాగా క్లిక్ అవుతారు.. కానీ కొన్ని సినిమాల తర్వాత ఎటుపోయారా కూడా తెలియని పరిస్థితుల్లో కనుమరుగవుతారు. కెరియర్ లో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు ..సినిమాలు ఎంచుకున్న విధానం.. ఇలా ఏదో ఒక కారణంగా సరి అయిన సక్సెస్ లేక ఇండస్ట్రీ నుంచి ఫెడ్ అవుట్ అవుతారు. ఇండస్ట్రీ నుంచి వెళ్లడం అయితే వెళ్తారు కానీ…ఎక్కడికి వెళ్ళినా వారి మనసు తిరిగి ఇండస్ట్రీ వైపే లాగుతుంది.
అందుకే ఎంతోమంది స్టార్ హీరోయిన్లు పెళ్లిళ్లు అయిన తర్వాత తాత్కాలికంగా తమ కెరీర్ కి పుల్ స్టాప్ పెట్టినప్పటికీ ..ఆ తరువాత నటనను వదల లేక సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా వెనకాడరు. స్నేహ ,సిమ్రాన్, రాశి ,నగ్మా ఇలా అందరూ అదే కోవకు చెందిన వారు. ఇలా రీఎంట్రీ ఇచ్చే సీనియర్ యాక్టర్స్ ను ఆడవారే కాదు ఒకప్పటి హీరోలు కూడా ఉన్నారు. సీనియర్ నటుడు ఎవరో తెలుసుకుందాం..
Ads
సన్నగా .. చలాకీగా ..పక్కింటి అబ్బాయిలా ఉండే నటుడు రోహిత్. ఇప్పటి పిల్లలకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కానీ ఒక 10 ,15 ఏళ్ల క్రితం యూత్ లో ఉన్నవారికి.. నువ్వు యాడికెళ్తే ఆడకొస్తే సువర్ణ…పాట వింటే వెంటనే రోహిత్ గుర్తుకు వస్తాడు. సిక్స్ టీన్స్, గర్ల్ ఫ్రెండ్ ,జానకి వెడ్స్ శ్రీరామ్ లాంటి చిత్రాలతో మంచి సక్సెస్ సాధించిన ఈ హీరో ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కంప్లీట్ గా ఫేడ్ అవుట్ అయిపోయాడు. అయితే ఇప్పుడు తిరిగి ఒక మంచి క్యారెక్టర్ దొరకడంతో మళ్ళీ సినీ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఒకప్పటి ఫ్యామిలీ హీరో వడ్డే నవీన్ కూడా తిరిగి సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ ,నాని.. సినీ ఇండస్ట్రీలో ఏ రేంజ్ హీరోలో ఒకప్పుడు వడ్డే నవీన్ ఆ రెంజ్ లో ఉండేవాడు. యాక్షన్ పరంగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న క్రమంగా అతనికి సక్సెస్ రేట్ పడిపోయింది. దాంతో మెల్లిగా సినిమాల్లో నటించడమే మానేశాడు. మళ్లీ తిరిగి ఇప్పుడు ఒక పెద్ద సినిమాతో రీఎంట్రీ కి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. వడ్డే నవీన్ కి ఫ్యామిలీ లేడీస్ ఫాలోయింగ్ ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేది.