Ads
ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు,ఎలాంటి హంగామా లేకుండా సైలెంట్ గా వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న సినిమా తికమకతాండ. సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో సినిమా చూడటానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
టిఎస్ఆర్ మూవీ మేకర్స్ సంస్థ పై ట్విన్స్ హరికృష్ణ, రామకృష్ణ హీరోలుగా, యాని, రేఖ నిరోషా హీరోయిన్లుగా నటించిన సినిమా తికమక తండా. ఈ సినిమాకి వెంకట్ డైరెక్టర్. ఇతను గతంలో విక్రమ్ కే కుమార్, గౌతమ్ మీనన్ దగ్గర పని చేశాడు.
ఇలాంటి కాన్సెప్ట్ తో కూడా సినిమా తీయొచ్చా అని విమర్శకులను సైతం ఆలోచింపచేసేలాగా తీశాడు. అంతలా ఈ సినిమాలో ఏముంది అంటే ఊరందరికీ మతిమరుపు అనేది కాన్సెప్ట్. అయితే ఈ కాన్సెప్ట్ జనాలు ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారు అనే విషయాన్ని పక్కన పెట్టి మరి ధైర్యంగా ఈ సినిమా చేయగలిగాడు అంటే డైరెక్టర్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
Ads
తికమకతాండ అనే ఒక మారుమూల గ్రామంలో ఊరందరికీ మతిమరుపు సమస్య ఉంటుంది. అందుకే రచ్చబండ తో పాటు ప్రతి దానికి పేర్లు పలకల మీద రాసి పెట్టుకుంటారు ఊరి జనం. కానీ ఆ మతిమరుపు వల్ల ఊరి జనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఆ సమస్యల నుంచి బయటపడటం కోసం అమ్మవారికి పూజలు జరిపించాలి అనుకుంటారు. కానీ అదే సమయానికి ఆ ఊరి విగ్రహం మాయమైపోతుంది.
అసలు విగ్రహం ఏమైంది, హీరోలు విగ్రహాన్ని ఎలా తీసుకు రాగలిగారు. మతిమరుపు సమస్యని పరిష్కరించుకోవటానికి వాళ్లు పడిన పాట్లు మధ్యలో హీరోలు, హీరోయిన్లు, వాళ్ళ లవ్ ట్రాక్ అన్నీ కూడా సినిమాని ఒక మెట్టు పైకి ఎక్కించేలాగే ఉన్నాయి. మతిమరుపు వల్ల జనాలు పడుతున్న ఇబ్బందిని కామెడీగా చూపించడం లో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్.