ఒకే ఒక్క సినిమాతో ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయాడు..! ఈ యాక్టర్ ఎవరో తెలుసా..?

Ads

చాలామంది నటులు ఎన్నో రోజులుగా ఇండస్ట్రీలో ఉన్న కూడా వారికి ఎంతకాలం రాని గుర్తింపు ఒక్క సినిమాతో వచ్చేస్తుంది. తాజాగా 12th ఫెయిల్ అనే సినిమా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అక్టోబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమాని అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత ఓటిటి లోకి వచ్చేసిన తర్వాత ఈ సినిమాని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు.

ఈ సినిమాలో హీరోగా నటించిన విక్రాంత్ మస్సే నటనకు ప్రశంసలు అందుతున్నాయి. అందరూ విక్రాంత్ బ్యాగ్రౌండ్ గురించి వెతకడం మొదలుపెట్టారు. ఒకసారి విక్రాంత్ పూర్తి వివరాలు పరిశీలిస్తే…

vikrant massey

12th ఫెయిల్ సినిమాలో విక్రాంత్ మనోజ్ శర్మ అనే ఐపీఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో జీవించేసాడు. నిజంగా ఈ పాత్రను చూసిన ఎవరైనా సరే మెచ్చుకోకుండా ఉండలేరు అంతలా అమాయకత్వంతో కూడిన పాత్రలో తన నటనతో బాగా అలరించాడు. సీరియల్స్ తో తన నటన ప్రస్తానాన్ని ప్రారంభించిన నేడు ఇండియా వైడ్ గుర్తింపు పొందాడు. 2007లో ధూమ్ మఛావో ధూమ్ సీరియల్ తో ప్రారంభించి తర్వాత బాలిక వధు సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Ads

vikrant massey

తర్వాత 2013లో లుటేరా సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యాడు. తర్వాత వరుస పెట్టి హాఫ్ గార్ల ఫ్రెండ్, గ్యాస్ లైట్, ముంబైకర్, లిప్ స్టిక్ అండర్ మై బుర్కా, ఫోరెన్సిక్ మొదలగు సినిమాల్లో నటించాడు. ఇవే కాకుండా మీర్జాపూర్, క్రిమినల్ జస్టిస్, మేడ్ ఇన్ హెవెన్ వంటి వెబ్ సిరీస్ లతో కూడా ఆకట్టుకున్నాడు.

vikrant massey

బ్రోకెన్ బ్యూటిఫుల్ వెబ్ సిరీస్ లో తనతో పాటు నటించిన హీరోయిన్ శీతల్ ఠాకూర్ తో ప్రేమలో పడ్డాడు. 2019లో వీరి నిశ్చితార్థం జరగగా, 2022లో వివాహం చేసుకున్నారు. విక్రాంత్ నటనపాటు డ్యాన్స్ లో కూడా మంచి నైపుణ్యం పొంది ఉన్నాడు.ఇక 12th ఫెయిల్ సినిమాలో విక్రాంత నటనకి బాలీవుడ్ లోని దిగ్గజ నటులు అందరు కూడా ప్రశంసలు కురిపించారు. ఇది ఖాళీ సమయంలో విహారయాత్రలకు వెళ్లడానికి బాగా ఇష్టపడతాడట. ఇది ఇంట్లో ఉంటే డాన్స్ చేస్తూ, వీడియో గేమ్స్ ఆడుతూ టైం పాస్ చేస్తానని చెప్పుకొచ్చాడు

Previous articleఅయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠలో… నరేంద్ర మోడీతో పాటు పాల్గొనబోతున్న ఆ 5 ప్రముఖులు ఎవరంటే..?
Next article“నాకు మరో జన్మనిచ్చారు..!” అంటూ… “రేణు దేశాయ్” ఎమోషనల్ పోస్ట్..!ఏం అన్నారంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.