Ads
మనం రోజు చూసే హీరోయిన్లు ఒకప్పటి బాల నటులు అని తెలిస్తే అవునా అని నోరెళ్ళబెడతాం. ఆ సినిమాలని గుర్తు చేసుకుంటూ అప్పటికీ ఇప్పటికీ ఉన్న చేంజెస్ వెతికే పనిలో పడతాం.
ఇప్పుడు అలాంటి ఒక బాల నటి గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకప్పుడు బాపు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన సినిమా రాంబంటు గుర్తుండే ఉంటుంది.
ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వలేదు కానీ ఇందులో రాజేంద్రప్రసాద్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఇందులో ఒక బాల నటి రాజేంద్రప్రసాద్ తో పోటాపోటీగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఆమె తర్వాత పెరిగి పెద్దయి సౌత్ ఇండియా లోనే స్టార్ నటిగా పేరు సంపాదించుకుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ఆమె మరెవరు కాదండి మన బ్లాక్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్. ఈమె పాత తరం హీరో రాజేష్ కుమార్తె. హాస్య నటి శ్రీలక్ష్మి కి స్వయంగా తమ్ముడి కూతురు.
Ads
ఒకప్పుడు తన రంగు కారణంగా ఎన్నో విమర్శలకి గురి అయింది ఈ నటి. అయితే తన నటనతో ఆ విమర్శలని వెనక్కి నెట్టేసి విమర్శకుల చేత సైతం శభాష్ అనిపించుకుంది. ఈ నటి తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువే కానీ చాలా మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఈమె తమిళంలో ఎక్కువగా సినిమాలు చేసింది.
మంచినటిగా రాణించాలంటే అందము రంగు కాదు కావాల్సింది టాలెంట్ అని నిరూపించిన చాలామంది బ్లాక్ బ్యూటీస్ లో ఐశ్వర్య రాజేష్ ఒకరు. ఈమె రియల్ లైఫ్ లో కూడా హీరోయినె. ఎందుకంటే ఈమె చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు తర్వాత ఆక్సిడెంట్ లో ఈమె అన్న చనిపోయాడు. ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబాన్ని నిలబెట్టడంలో ఐశ్వర్య రాజేష్ సక్సెస్ సాధించింది ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ దాదాపు 20 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తుందని సమాచారం