Ads
సాధారణంగా హీరోయిన్స్ కి ఇండస్ట్రీలో ఉండే సమయం తక్కువ అని అంటారు. ఒకవేళ వాళ్ళు తర్వాత నటించినా కూడా హీరోయిన్ పాత్రలో నటించే అవకాశం తక్కువగా ఉంటుంది అని అంటారు. కొంత మంది హీరోయిన్స్ మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకోగలుగుతారు. కొంత మంది హీరోయిన్స్ ఒక సమయంలో చాలా ఎక్కువగా సినిమాలు చేస్తారు. ప్రతి హీరోతో ఒక సినిమా చేస్తారు. కానీ ఆ తర్వాత అసలు సినిమాలు చేయరు. అందుకు కారణాలు ఏమైనా అయ్యే అవకాశం ఉంది. రకుల్ ప్రీత్ సింగ్. ఒక సమయంలో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్. ఏ సినిమా చేసినా హిట్ అయ్యేది.
టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలు అందరితో నటించారు. ఒక సంవత్సరంలో అయితే ఆ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీలో విడుదల అయిన ఎక్కువ శాతం సినిమాల్లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఉన్నారు. టాలీవుడ్ లో మరొక స్టార్ హీరోయిన్ అవుతారు అని అందరూ అనుకున్నారు. కానీ 2019 నుండి మెల్లగా తెలుగు సినిమాలు తగ్గించారు. ఇప్పుడు తెలుగు సినిమాలు చేయట్లేదు. రకుల్ ప్రీత్ సింగ్ చివరిగా చేసిన తెలుగు సినిమా బూ. ఇది కూడా జియో సినిమాలో విడుదల అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమా లో కూడా నటించలేదు.
కానీ హిందీ సినిమాలు మాత్రం చేస్తూ వస్తున్నారు. ఇన్ని సినిమాలు చేస్తున్నా కూడా ఒక్క సినిమాతో సరైన గుర్తింపు రావట్లేదు. తెలుగులో నటనకి ఆస్కారం ఉన్న పాత్రలు ఎక్కువగా పోషించలేదు. కమర్షియల్ సినిమాల్లోనే రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కువగా నటించారు. హిందీలో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తున్నా కూడా గుర్తింపు రావట్లేదు. హిందీలో హీరోయిన్స్ కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది. అక్కడ బాగా నటించే హీరోయిన్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు. రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల శివ కార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ సినిమాలో నటించారు.
ఈ సినిమా 2016 లో రూపొందించారు. ఇప్పుడు భారతీయుడు 2 సినిమాలో కూడా నటించారు. ఈ సినిమా కూడా 2019 లో రూపొందించిన సినిమా. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమా సైన్ చేసి చాలా సంవత్సరాలు దాటింది. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మారిపోయారు కూడా. చాలా సన్నగా అయిపోయారు. ఫొటోస్ లో మామూలుగానే కనిపిస్తున్నా కూడా, వీడియో షేర్ చేసినప్పుడు అందులో రకుల్ ప్రీత్ సింగ్ సన్నగా అయిపోవడం, ఆమెలో వచ్చిన మార్పు తెలుస్తోంది. మరి తెలుగు సినిమాలు సైన్ చేయకపోవడానికి కారణం ఏంటి అనేది ఎవరికి తెలియదు.