Ads
సాధించాలి అని తపన ఉంటే చాలు ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు ఎన్ని అడ్డంకులుగా ఎదురైనా సరే అనుకున్నది సాధించ వచ్చు అని నిరూపించాడు యూపీఎస్సీ సివిల్స్ ర్యాంకర్ భానుప్రతాప్. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కొని నేడు సివిల్స్ రాంకర్ గా నిలిచి అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలిచాడు.
ఒకసారి భాను ప్రతాప్ కుటుంబ నేపథ్యం గురించి చూస్తే… తండ్రి పేరు ఉత్తమ్ సింగ్… ఈయన ఒక సాధారణ రైతు…. తల్లి పేరు గంగాదేవి… సామాన్య గృహిణి. భాను ప్రతాప్ యుపిఎస్సి సాధించడానికి ఎన్నో కష్టాలు పడ్డాయి లేకుండా సొంతంగా రోజుకి 8 గంటల పాటు ప్రిపేర్ అవుతూ చివరికి యూపీఎస్సీ 2020 సంవత్సరంలో 372వ ర్యాంకు సాధించాడు.
Ads
2016 లో సివిల్స్ ప్రయత్నాలు ప్రారంభించిన భాను ప్రతాప్ 2016, 2017 లో ఫెయిల్ అయ్యాడు. 2018, 2019లో సివిల్స్ రాసి విజయం సాధించాడు. చివరికి 2020 సంవత్సరంలో యూపీఎస్సీలో ఉత్తీర్త సాధించి అనుకున్నది సాధించాడు. హిందీ మాధ్యమం నుండి వచ్చిన భాను ప్రతాప్ కి ఇంగ్లీష్ అనేది పెద్ద సవాలుగా మారింది. దానిపైన పట్టు సాధించడానికి చాలా కష్టపడేవాడు. కానీ ఊహించిన విధంగా ఇంటర్వ్యూ మొత్తం హిందీ భాషలో జరిగింది.
అయితే పరిస్థితి ప్రిపేర్ అయ్యే సమయంలో చాలా ఒత్తిడికి లోనయ్యే వాడిని అని… కొన్నిసార్లు నిరాశ ఎదురైనా సరే దాన్ని అధిగమించి ప్రిపేర్ అయ్యి అనుకున్నది సాధించాలని చెప్పుకొచ్చాడు. తనకి తన కుటుంబ సభ్యులు సపోర్టు ఎంతగానో ఉండేదని… మనం అనుకున్నది మనం సాధించగలగాలి అంటే ఎవరెన్ని చెప్పిన ఆ మాటలు వినకూడదని… లక్ష్యంపైనే అదృష్టంతా పెట్టి దాన్ని సాధించాలని చెప్పాడు