Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా కంటెంట్ ఉన్న చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే కంటెంట్ కరెక్ట్ గా ఉంటే చిన్న సినిమాలు అయినా భారీ హిట్లుగా నిలుస్తున్నాయి. మంచి థ్రిల్లర్ జానర్ మూవీలు…మూవీ లవర్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. గత ఏడాది సెప్టెంబర్లో తమిళ్లో విడుదలైన పరంపొరుల్ మూవీ తాజాగా ఈటీవీ విన్ ఓటిటి యాప్ లో స్టీమ్ అవుతుంది. పాజిటివ్ రెస్పాన్స్ తో ట్రెండ్ అవుతుంది ఈ సినిమా.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గౌరీ(అమితాశ్ ప్రధాన్) ఒక సాధారణ మధ్యతరగతి యువకుడు. అతని చెల్లి అనారోగ్య సమస్య వల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆమెను బతికించుకోవడానికి డబ్బుకోసం కష్టపడుతుంటాడు. అయితే తండ్రిలా కష్టపడి సంపాదించకుండా ఈజీగా సంపాదించాలని దొంగతనాలు చేస్తాడు. గౌరీ ఒకప్పుడు అక్రమంగా విగ్రహాలను స్మగుల్ చేసే సద్గుణ దగ్గర పనిచేస్తాడు. అతడు చనిపోవడంతో తర్వాత దొంగతనాలు చేస్తూ ఉంటాడు. పోలీసాఫీసర్ మైత్రేయన్ (శరత్ కుమార్) ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్లి దొరికిపోతాడు. ఇక లంచగొండి అయిన మైత్రేయన్.. ఎక్కువ డబ్బు సంపాదించి రిటైర్ అయ్యి.. హ్యాపీ గా జీవించాలని ఆశపడతాడు. అంతేకాకుండా విడిపోయిన భార్య, కూతురుకు ఎలాంటి బాధలు లేకుండా చేయాలని ఆరాటపడతాడు.
అలాంటి సమయంలోనే విగ్రహాలను అక్రమంగా తరలించే సద్గుణ దగ్గర పనిచేసిన గౌరీ చేతికి చిక్కడంతో…అతడిని వాడుకొని అక్రమంగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తాడు. ఇక ఆ ప్లాన్ ను గౌరికి చెప్పి… చెయ్యకపోతే జైలుకు పంపిస్తానని బెదిరిస్తాడు. ఒకపక్క చెల్లి ఆపరేషన్.. ఇంకోపక్క జైలు.. దీంతో గౌరీ చేసేదేం లేక మైత్రేయన్ తో చేతులు కలుపుతాడు.
Ads
నాగపట్నం దగ్గరలోని ఒక ఊరి చివర పొలంలో దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటి ఒక బుద్ధ విగ్రహన్ని స్మగుల్ చేయాలని గౌరికి ఆఫర్ వస్తుంది. ఇక ఆ డీల్ ను ఎలా అయినా సెట్ చేసి రూ.50 కోట్లు తీసుకోవాలని ప్లాన్ చేస్తారు. ఆ విగ్రహాన్ని తీసుకొని డీలర్స్ దగ్గరకు వెళ్లి రూ. 15 కోట్లకు బేరం ఆడతారు. అయితే ఆ విగ్రహం కోసం వెతికే మరో గ్యాంగ్ వీరిపై అటాక్ చేయడంతో మధ్యలో ఆ విగ్రహం విరిగిపోతుంది. దీంతో తాము అనుకున్న డబ్బులు రావేమో అని అలాంటి విగ్రహాన్ని మరొకటి తయారుచేయించి అమ్మడానికి ప్లాన్ చేస్తారు. దానికోసం మైత్రేయన్ అప్పటివరకు అక్రమంగా సంపాదించిన డబ్బు మొత్తాన్ని ఒక ప్రొఫెసర్ కు లంచంగా ఇస్తాడు. అది ఒరిజినల్ అని డీలర్స్ కు ప్రొఫెసర్ చెప్పడంతో డీల్ ఓకే అయ్యి డబ్బు చేతికి వచ్చాక గౌరీని చంపేయాలని మైత్రేయన్ ప్లాన్ చేస్తాడు. ఇక లాస్ట్ మినిట్ లో పోలీసులు డీల్ జరిగే ప్రదేశానికి వచ్చి మైత్రేయన్ ను, డీలర్స్ ను అరెస్ట్ చేస్తారు.
ఇక్కడే మైత్రేయన్ కు దిమ్మతిరిగే షాక్ తగులుతుంది.మొదట్లో గౌరీనీ గొర్రె అనుకున్న మైత్రేయన్ కు.. అసలు గొర్రె తానే అర్థమవుతుంది.అసలు గౌరీ ఎవరు..? మైత్రేయన్ పై ఎందుకు పగ తీర్చుకున్నాడు..? పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి మైత్రేయన్ ను జైలుకు ఎందుకు పంపాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…! ఈ సినిమా ఇప్పుడు థ్రిల్లర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రధాన నటులు నటన సినిమాకు బాగా ప్లస్ అయింది. దర్శకుడు టేకింగ్ బాగుంది. ఇక ఈ చిన్న సినిమాకు యువన్ శంకర్ రాజ సంగీతం అందించడం విశేషం.