Ads
ప్రపంచ కప్ 2023 టోర్నీ అనంతరం పాకిస్థాన్ క్రికెట్ లో చాలా మార్పులు జరిగాయి. పాక్ క్రికెట్ బోర్డు జట్టు కెప్టెన్ నుండి సెలక్టర్ దాకా మొత్తం సిబ్బందిని మార్చేసింది. ప్రపంచకప్ జట్టు సారధి బాబర్ అజామ్ మాత్రం తానే కెప్టెన్సీ కి రాజీనామా చేశాడు.
పాక్ క్రికెట్ బోర్డు డైరెక్టర్, సెలక్టర్ ను తొలగించి వారి స్థానంలో కొత్తవాళ్ళని సెలెక్ట్ చేసింది. డైరెక్టర్ గా హఫీజ్, సెలక్టర్ గా మాజీ పేసర్ వాహాబ్ రియాజ్ ను తీసుకుంది. షాహీన్ ఆఫ్రిదిని పరిమిత ఓవర్ల క్రికెట్ కు కెప్టెన్ గా, టెస్టుల్లో షాన్ మసూద్ ను కెప్టెన్ గా ఎంచుకుంది. కాగా, ప్రస్తుతం పాకిస్థాన్ ఆస్ట్రేలియా-ఏ టీమ్ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి రోజు మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు పాక్ ఆటగాడు బాబర్ అజామ్ ఫేవర్ చేయాలని చూసాడట. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ఆస్ట్రేలియా జట్టుకు సాయం చేయాలనుకున్నాడంటే, వినే వారికి ఆశ్చర్యం కలుగుతుంది. అయితే అది వాస్తవమేనని అంటున్నారు. పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 37 ఓవర్ లో ఆసీస్ బౌలర్ వెబ్ స్టర్ తొలి బంతి వేశాడు. షాన్ మసూద్ ఆ బంతిని లాంగాఫ్ మీదుగా కొట్టాడు.
అయితే షాన్ కొట్టిన బాల్ పాక్ క్రికెటర్ బాబర్ అజామ్ సైడ్ నుండి వెళ్ళింది. ఎవరు ఊహించని విధంగా ఆ బంతిని క్యాచ్ పట్టుకోవడానికి బాబర్ ప్రయత్నించాడు. అయితే ఈ బాల్ కొంచెం దూరంగా వెళ్ళింది. అక్కడ ఉన్నవారందరికి, మ్యాచ్ చూసేవారికి బాబర్ ఎందుకు అలా చేసాడో అనే విషయం మాత్రం అర్ధం కాలేదు.
Ads
ప్రాక్టీస్ మ్యాచ్ కావడం వల్ల ఏదో సరదాగా చేసి ఉండవచ్చు అని అభిమానులు కామెంట్ చేయగా, నెటిజన్లు మాత్రం బాబర్ అజామ్ ను ట్రోల్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాకు బాబర్ సహయం చేసాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరీ కొందరు కెప్టెన్సీ పోయిందన్న కోపంలో కొత్త కెప్టెన్ మసూద్ ను అవుట్ చేయాలనుకున్నాడంటూ ట్రోల్ చేస్తున్నారు.
Babar Azam keeping himself in the game at the non-striker's end…. #PMXIvPAK pic.twitter.com/bMZk2Nk7pi
— cricket.com.au (@cricketcomau) December 6, 2023
Also Read: 76 ఏళ్ల క్రితం టీం ఇండియా కెప్టెన్ ఎవరో తెలుసా..? అప్పట్లో ఆస్ట్రేలియా వెళ్లిన ప్లేయర్స్ ఎవరంటే..?