Ads
రీమేక్ సినిమాలు ఏ ఇండస్ట్రీలో అయినా వస్తూ ఉంటాయి. ఇది చాలా సహజంగా జరిగే విషయం. ఏదైనా ఒక సినిమా ఏదైనా ఒక భాషలో హిట్ అయితే, ఆ సినిమాని రీమేక్ చేస్తారు. మన సినిమాలను చాలా భాషల్లోకి రీమేక్ చేశారు. కొన్ని సినిమాలు ఒరిజినల్ సినిమా అంత హిట్ అయితే, కొన్ని సినిమాలు మాత్రం అంత పెద్ద హిట్ అవ్వలేదు. అందులోనూ మన స్టార్ హీరోలు నటించిన సినిమాలు అయితే, ఒకవేళ అవి చాలా పెద్ద హిట్ అయితే వేరే భాషలోకి అవుతాయి. కొన్ని సినిమాలు తెలుగులో రిలీజ్ అయిన వెంటనే రీమేక్ అయితే, కొన్ని సినిమాలు మాత్రం చాలా కాలం తర్వాత రీమేక్ చేస్తారు.
అయితే రీమేక్ చేసినప్పుడు కొన్ని సార్లు వాళ్ళ నేటివిటీకి తగ్గట్టు వాళ్ళు మార్పులు చేసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సార్లు మాత్రం ఒరిజినల్ ఎలా ఉందో అలాగే రీమేక్స్ కూడా చేస్తారు. ఇప్పుడు పైన ఉన్న ఫోటో ఒక సినిమాలోని సీన్. ఆ సినిమా మన తెలుగు సూపర్ హిట్ సినిమాకి రీమేక్. పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సినిమా అత్తారింటికి దారేది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలు ఎన్ని సార్లు చూసినా రిపీట్ వాల్యూ ఉంటుంది. అందులో అత్తారింటికి దారేది సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలోని కామెడీ అప్పుడు చాలా హైలైట్ గా నిలిచింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు అయితే ఇప్పటికి కూడా వింటూనే ఉంటారు.
Ads
ఈ సినిమాని వివిధ భాషల్లో రీమేక్ చేశారు. 2015 లో కన్నడలో ఈ సినిమాని రన్న పేరుతో రీమేక్ చేశారు. కిచ్చా సుదీప్ ఈ సినిమాలో హీరోగా నటించారు. తమిళ్ లో ఈ సినిమాని వంద రాజా వరువేన్ పేరుతో రీమేక్ చేశారు. శింబు హీరోగా నటించిన ఈ సినిమా 2019 లో విడుదల అయ్యింది. పైన ఉన్నది మాత్రం బెంగాలీ రీమేక్ లోనిది. బెంగాలీలో ఈ సినిమాని అభిమాన్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో జీత్ హీరోగా నటించారు. ఇది క్లైమాక్స్ లో వచ్చే రైల్వే స్టేషన్ సీన్. సీన్ లోకేషన్ కూడా మార్చలేదు. మన తెలుగులో ఎలా ఉందో అలాగే తీశారు.
Em Movie cheppandi ra pic.twitter.com/3E4vyDuzaE
— Avi💫 (@NameisAvinashJ) May 21, 2024