Ads
భారతదేశం అంటే ప్రాచీన దేశం. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే కూడా భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశ కట్టుబాట్లు అన్ని కూడా విభిన్నంగా ఉంటాయి. దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, విభిన్న మతాలు, అందరూ కలిసిమెలిసి ఉండే విధానం ఒక భారతదేశంలో తప్ప మరే ఏ దేశం నందు కనిపించవు. భారతదేశంలో పుట్టిన చాలా రకాల సంప్రదాయాలను కట్టుబాట్లను ప్రపంచ దేశాలు కూడా ఫాలో అవుతున్నాయి. 1000 ఏళ్ల కిందటే భారతదేశ చరిత్ర ప్రారంభమైందని వాటిని నిరూపించే ఆధారాలు చాలా ఉన్నాయి.
ఒకప్పుడు పాతకాలంలో కేవలం ఆహారం కోసం మాత్రమే పని చేసేవారు. ఆహారాన్ని సంపాదించుకునేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడేవారు. బతకడం కోసం మాత్రమే వ్యవసాయం చేసేవారు కానీ అప్పటిలో వ్యవసాయం చేయడానికి తగ్గ పనిముట్లు ఉండేవి కాదు. దీంతో పంట తీయడానికి సంవత్సరం అంతా కష్టపడేవారు.తర్వాత చిన్నచిన్నగా పనిముట్లు అందుబాటులోకి వచ్చాయి.
కొత్త కొత్త పనిముట్లు తయారు చేయడం ఆధునికరణ పెరగడంతో తర్వాత ఏడాదికి రెండు పంటలు పండించేవారు.వరి, పత్తిలాంటివి ఎక్కువగా పండించేవారు. ఆ తర్వాత ఎద్దులను ఉపయోగించి వ్యవసాయం చేయడం ఆ తర్వాత వివిధ వ్యవసాయ పనిముట్లు అందుబాటులోకి రావడంతో మరింత సులువు అయింది.ప్రస్తుతం ప్రపంచంలో టెక్నాలజీ రోజు రోజుకి పెరిగిపోతుంది. అయినప్పటికీ భారతదేశంలో ఉన్న ప్రాచీన కట్టుబాట్లు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి.
Ads
వాటిలో ఒకటి వస్త్రధారణ. అప్పటికి ఇప్పటికే వస్త్రధారణలో ఎలాంటి మార్పు రాలేదు.పాతకాలంలో మహిళల చీరలు ధరించేవారు.ఇప్పటికీ చీరలు ధరిస్తూనే ఉన్నారు. మగవారు ధోవతి పంచలా కట్టుకునేవారు పైన చొక్కా ధరించేవారు.ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఈ ఆచారాలను తుచా తప్పకుండా పాటిస్తారు.అలాగే పురాతన కాలంలో స్వయంగా పండించుకున్న ఆహారాన్ని మాత్రమే తినేవారు కానీ ఇప్పుడు పండించే వారు తక్కువ తినేవారు ఎక్కువ ఉండటం వల్ల ప్రతి వస్తువు కూడా కల్తీ అవుతుంది.
పాతకాలంలో ఏ జబ్బు వచ్చిన ఆయుర్వేదం ద్వారా వైద్యం చేసేవారు. అడివిలో దొరికే వనమూలికలు, పసర్లు ద్వారానే ఏ రోగాన్ని అయినా నయం చేసేవారు. కొంతమంది అయితే ఇప్పటికి ఆయుర్వేద పద్ధతులను పాటిస్తున్నారు. మన దేశ సంస్కృతికి ప్రభావితమై మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశ ఔన్నత్యాన్ని తెలుసుకొని, ఆ కట్టుబాట్లను అలవాటు చేసుకుంటున్నాయి.