Ads
మారుతున్న కాలంతో పాటు సంప్రదాయాలను అటకెక్కించడం ప్రస్తుతం జనరేషన్ కి బాగా ఫ్యాషన్ అయిపోయింది. కుటుంబ సభ్యుల అనుమతితో సంబంధం లేకుండా ప్రేమించడం ,పెళ్లి చేసుకోవడం నిత్యం ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో పిల్లలు ఇంట్లో సంప్రదాయానికి విరుద్ధంగా ప్రేమ పేరుతో వెళ్ళిపోవడం, పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, సహజీవనం వంటి కొత్త ఒరవడలను నేర్చుకోవడం చేస్తే అది ఆ కుటుంబం పరువు ప్రతిష్టల పైన, ఆ పిల్లల జీవితాల పైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది కళ్ళకు కట్టినట్టు చూపించే సందేశాత్మకమైన చిత్రం ‘తీ ఇవన్’ . గతంలో తెలుగులో కూడా ఇదే కాన్సెప్ట్ తో “బస్టాప్” అనే సినిమా వచ్చింది.
మనం చాలా సినిమాలలో హీరో తన ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయి కోసం వేరే లెవెల్ లో ఫైట్ చేసే సీన్స్ చూసి విజిల్స్ కొడతాం. అయితే ఆ ఒక్క సీన్ వల్ల ఆ కుటుంబం ఎంత బాధ భరిస్తుంది అన్న విషయాన్ని చూపించే సినిమాలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ప్రస్తుతం యువతకు అవసరమైన ఇటువంటి సందేశాన్ని అందించే మూవీ ‘తీ ఇవన్’ అని చెప్పవచ్చు. ఇది కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం.
Ads
సీనియర్ యాక్టర్ కార్తీక్ ఈ చిత్రంలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. మనిదన్ సినీ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి నిర్మలాదేవి జయమురుగన్ నిర్మాణ సారథ్యం వహించారు. ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు టీఎం జయమురుగన్ నిర్వహించారు. సీనియర్ యాక్టర్ కార్తీక్ ,సుకన్య, సన్నీలియోన్ ,సేతు అభిత, మస్కార, యువరాణి, రాధారవి, ఇళవరసు, జాన్ విజయ్, సింగం పులిం, శరవణ శక్తి, సుమన్, హేమంత్, శ్రీధర్ ఈ మూవీ లో నటించారు.
మొత్తం ఏడు పాటలతో రూపొందించిన ఈ చిత్రంలో ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ కూడా ఉంది. ఈ సాంగ్ కి సన్నీలియోన్ స్టెప్స్ కుర్రకారును ఉర్రూతలూగించడం కన్ఫామ్ అని చిత్ర బృందం అంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ మూడు షెడ్యూల్సుగా చెన్నై, పొల్లాచ్చి, పుదుచ్చేరి తదితర ప్రాంతాలలో పూర్తి చేయనున్నారు. వచ్చే నెల విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.
watch video: