ఇప్పటి వరకు పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టని తెలుగు హీరోలు..!

Ads

రాజమౌళి మొదలుపెట్టిన పాన్ ఇండియా ట్రెండ్ తో ప్రస్తుతం హీరోలు తెలుగు సినిమా అనడమే మరిచిపోతున్నారు. ఇటీవల కాలంలో వస్తున్న సినిమాలలో ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలే ఉంటున్నాయి.

మేకర్స్ ప్రకటించే కొత్త చిత్రాలు కూడా దాదాపు పాన్ ఇండియా సినిమగానే అనౌన్స్ చేస్తున్నారు. హీరోలు కూడా పాన్ ఇండియా పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. టాలీవుడ్ హీరోలందరు పాన్ ఇండియా అంటూ వెళ్తుండగా ముగ్గురు స్టార్ హీరోలు మాత్రం పాన్ ఇండియా కోసం ప్రయత్నించడం లేదు. ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. మహేష్ బాబు:

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ కు తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన తెలుగులో నటించిన సినిమాలు ఇతర భాషలలో డబ్ అయ్యి, మంచి విజయాన్ని అందుకున్నాయి. అయినా ఇప్పటివరకు మహేష్ బాబు పాన్ ఇండియా మూవీ ఒక్కటి కూడా చేయలేదు. తాజాగా గుంటూరు కారం మూవీతో ప్రేక్షకులను అలరించిన మహేష్, తరువాత సినిమా  రాజమౌళితో చేయనున్నాడు. ఈ మూవీనే సూపర్ స్టార్ తొలి పాన్ ఇండియా చిత్రం.
2. పవన్ కళ్యాణ్:

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇప్పటివరకు తెలుగు సినిమాల పై మాత్రమే దృష్టి పెట్టారు. ఎందుకో కానీ పవర్ స్టార్ కూడా పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ చేయలేదు. పవన్ నటించిన సినిమాలు ఇతర భాషలలో రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం పవన్ నటిస్తున్న ఓజీ, హరి హర వీర మల్లు సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతున్నట్లు సమాచారం.

3. బాలకృష్ణ:

సీనియర్ అగ్ర హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ఆల్రెడీ పాన్ ఇండియా చిత్రాలు చేసారు. నటించబోయే సినిమాలు కూడా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ గత ఏడాది కిసీ కా భాయ్ కిసీ కా జాన్, రానానాయుడు వెబ్ సీరీస్ తో బాలీవుడ్ లో ట్రై చేసారు. అయితే సీనియర్లలో బాలకృష్ణ మాత్రమే పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. సమయం వచ్చినపుడు బాలయ్య కూడా నటించాలనుకుంటునట్లు తెలుస్తోంది.
Also Read: సీనియర్ హీరోయిన్ శోభన ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా.? ఇప్పుడు ఆమె వయసు ఎంతంటే.?

Previous articleకొడుకు పడిపోయినా పట్టించుకోకుండా ఈ మహిళ ఏం చేస్తుందో చూసారా..? వైరల్ అవుతున్న వీడియోలో ఏం ఉందంటే..?
Next articleజీన్స్ ప్యాంట్ కి చిన్న పాకెట్లు ఎందుకుంటాయో తెలుసా.. వాటి ఏర్పాటు వెనుక ఉన్న కధ కమామిషు చూద్దాం!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.