Ads
సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లకి పెద్ద పీట వేస్తారు. ఒక్కసారి ఏదైనా మూవీలో ఒక కాన్సెప్ట్ సక్సెస్ అయితే తిరిగి దాన్ని మళ్ళీ మళ్ళీ పలు రకాలుగా తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఏదైనా ఒకటి ఫెయిల్ అయితే ఇక దాని జోలికి పోరు. సినిమా ముహూర్తం షాప్ నుంచి రెండు సీన్ పడే వరకు ఎన్నో సెంటిమెంట్ ఫాలో అవ్వడం సినీ ఇండస్ట్రీలో పరిపాటి. హీరో ,హీరోయిన్,టైటిల్, రిలీజ్ డేట్ ఇలా చాలా రకాల సెంటిమెంట్స్ నిర్మాతలకు ఉంటాయి.
ఇదేవిధంగా చూడాలని ఉంది సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో చాలా చిత్రాలు వచ్చాయి.కోల్‌కతా సినిమాలకు బాగా అచ్చి వస్తుంది అన్న సెంటిమెంట్ ఏర్పడింది. ఇలా ఈ మహానగరం బ్యాక్ ప్రాబ్లం వచ్చిన చిత్రాలు ఏవో…అందులో హిట్ ఏనో..ఫట్ ఏనో .. ఒక లుక్కేద్దాం..
చూడాలని ఉంది :
చిరంజీవి, అంజాలా జవేరి, సౌందర్య కాంబోలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘చూడాలని ఉంది’. 1998 లో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పటి టాలివుడ్ లో ఒక గేమ్ చేంజర్ గా గుర్తింపు పొందింది. చిరు కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా.
ఖుషి
పవన్ కల్యాణ్, భూమిక కాంబినేషన్ లో వచ్చిన ఖుషి మూవీ లో పవన్ నేటివ్ కోల్‌కతా గా చూపిస్తారు. మూవీ స్టార్టింగ్ కోల్‌కతా లోనే ఉంటుంది.2001 వచ్చిన ఈ మూవీ భారీ కలెక్షన్స్ ను సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
లక్ష్మీ :
వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ నయనతార ఫ్లాష్ బ్యాక్ కోల్‌కతా తో ముడిపడి ఉంటుంది. 2006 లో రిలీజ్ అయిన ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఓయ్
సిద్దార్థ్, షామిలి జంటగా నటించిన ఈ మూవీ బ్యాక్ డ్రాప్
కోల్‌కతా అయినప్పటికీ మూవీ యావరేజ్ గా నిలిచింది.
పంజా :
Ads
పవన్ హీరో గా తెరకెక్కిన ఈ గ్యాంగ్స్టర్ మూవీ కూడా కోల్‌కతా బ్యాక్ డ్రాప్ తోనే వచ్చింది.ఈ మూవీ పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.
ఉల్లాసంగా ఉత్సాహంగా :
ఈ రొమాంటిక్ కామెడీ చలనచిత్రం లోని సెకండ్ హాఫ్ చాలా వరకు కోల్‌కతా నేపథ్యంలో సాగుతుంది. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.
అదుర్స్ :
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ చాలా వరకు
కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. ఈ మూవీ మాంచి హిట్ అయ్యింది.
నాయక్ :
రాంచరణ్ డబుల్ రోల్ లో నటించిన ఈ మూవీ లో ఒక హీరో క్యారెక్టర్ అంతా కలకత్తా బేస్ లో సాగుతుంది.ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
ప్లే చేసిన ఈ మూవీకి కూడా వినాయక్ దర్శకుడు. కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మూవీ ఇది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.
పవర్ :
కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పవర్ మూవీలో రవితేజ ఒక సూపర్ కాప్ గా కనిపిస్తాడు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ను సాధించింది.
పడి పడి లేచె మనసు :
శర్వానంద్ ,సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన ఈ ప్రేమ కథ చిత్రం పూర్తిగా కోల్కత్త బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. కానీ ఈ సినిమా ఓ పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.
పెద్దన్న :
రజినీకాంత్ ,నయనతార కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ రజనీకాంత్ సిస్టర్ గా నటించింది. సెకండ్ హాఫ్ లో మాక్సిమం పార్ట్ కలకత్తా బ్యాక్ టాప్ లో సాగుతుంది. ఈ చిత్రం తెలుగులో అంతగా సక్సెస్ సాధించలేదు.
శ్యామ్ సింగ రాయ్ :
నాని సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం లోని ఫ్లాష్ బ్యాక్ మొత్తం కలకత్తా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది.
భోళా శంకర్ :
చిరంజీవి హీరోగా విడుదలైన లేటెస్ట్ చిత్రం భోళాశంకర్. కోల్కత్తా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రం ప్రస్తుతం ఇంకా థియేటర్లలో ఆడుతోంది. కానీ ఇప్పటికే మూవీ హిట్ కాదు అన్న టాక్ నడుస్తుంది.